మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఉప్పెన చిత్రం విడుదలకి రెడీగా ఉంది. కరోనా లేకపోయుంటే ఈ పాటికి ఈ సినిమా రిలీజై వైష్ణవ్ అదృష్టం తెలిసి ఉండేది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కొత్త అమ్మాయి క్రితి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్లలోనే విడుదల అవుతుందట.
అయితే ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. నీ కన్ను నీలి సముద్రం, ధక్ ధక్ ధక్ అంటూ సాగే ఈ పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. గత కొన్ని రోజులుగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పట్ల ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలన్నింటినీ ఈ రెండు పాటలు తుడిచి పెట్టాయి. ముఖ్యంగా నీ కన్ను నీలి సముద్రం పాట యూట్యూబ్ లో సంచలనం రేపుతుంది. ఇప్పటి వరకూ వంద మిలియన్ల వ్యూస్ ని దక్కించుకుంది.
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న దేవిశ్రీ ప్రసాద్ కి ఇండస్ట్రీ నుండి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. అదే టైమ్ లో దేవి సంగీతం అందించిన పాట వంద మిలియన్ల మార్కుని చేరుకోవడం సర్పైజింగ్ గా ఉంది. ఈ పాటకి శ్రీమణి, రఖీబ్ ఆలాం సాహిత్యం అందించగా జావెద్ ఆలీ ఆలపించారు.