Advertisementt

ఆ కాల్పులు కంగనాని బెదిరించడానికేనా..?

Sun 02nd Aug 2020 10:42 AM
kangana ranaut,bollywood,nepotism  ఆ కాల్పులు కంగనాని బెదిరించడానికేనా..?
Gund Sounds in Kanganas home premises ఆ కాల్పులు కంగనాని బెదిరించడానికేనా..?
Advertisement
Ads by CJ

బాలీవుడ్ పెద్దలపై విమర్శలు చేస్తూ వార్తల్లో ఉండే కంగనా రనౌత్, సుశాంత్ సింగ్ బలవన్మరణానికి కారణం బాలీవుడ్ లో కొనసాగుతున్న బంధు ప్రీతి కారణమని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. వారసత్వం వల్ల టాలెంట్ ఉన్న వారి అవకాశాలు పోతున్నాయని, బంధుప్రీతి కారణంగా ఎలాంటి బ్యాగ్రౌడ్ లేని నటులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కంగనా కామెంట్స్ చేసింది. అయితే తాజాగా కంగనా ఇంటి సమీపంలో కాల్పులు జరిగాయట.

బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న కంగనా మనాలీలో నివాసముంటుంది. అయితే శుక్రవారం రాత్రి 11:30గంటలకి కంగనా ఇంటి సమీపంలో తుపాకీ కాల్పులు వినిపించాయట. మొదట్లో టపాసుల శబ్దంగా భావించిన కంగనా రెండవసారి కూడా అదే సౌండ్ వినబడడంతో అప్రమత్తమై సెక్యూరిటీని పిలిచిందట. వరుసగా సెకన్ల వ్యవధిలోనే రెండు సార్లు తుపాకీ శబ్దం వినబడడంతో పోలీసులకి కంప్లైంట్ చేసిందట. 

వెంటనే పొలీసులు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించారట. అక్కడ సెక్యూరిటీని కూడా నియమించారట. అయితే ఈ విషయమై కంగనా అనేక అనుమానాలని బయటపెడుతుంది. బాలీవుడ్ వారు తనపై ఈ విధంగా కుట్ర చేసి ఉంటారని అనుకుంటుందిట. మరి ఆ కాల్పులు నిజంగా తుపాకీ శబ్దాలేనా అన్నది తెలియాల్సి ఉంది.

Gund Sounds in Kanganas home premises:

Gund Sounds in Kanganas home premises

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ