Advertisementt

పాయల్ కి తెలిసొచ్చిందట.. అలా కనిపించనుంటుంది..

Sun 02nd Aug 2020 09:13 AM
payal rajput,rx 100,telugu,tollywood  పాయల్ కి తెలిసొచ్చిందట.. అలా కనిపించనుంటుంది..
Payal wont work only glamour roles..! పాయల్ కి తెలిసొచ్చిందట.. అలా కనిపించనుంటుంది..
Advertisement
Ads by CJ

ఆర్ ఎక్స్ 100 సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్ ఆ తర్వాత చేసిన సినిమాల ద్వారా క్రేజ్ మొత్తం పోగొట్టుకుంది. ఆర్ ఎక్స్ 100 చిత్రంలో గ్లామర్ ని ఒలకబోస్తూ పాత్రకి తగినట్లుగా కనిపించిన అమ్మడు, ఆ తర్వాత గ్లామర్ ని మాత్రమే నమ్ముకుని అవకాశాలని రాకుండా చేసుకుంది. ఆర్ డీ ఎక్స్ లవ్ చిత్రంలో అవసరం లేకున్నా రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. కానీ అదే ఆమె పాలిట శాపంగా మారింది.

అప్పటి వరకూ పాయల్ ని హీరోయిన్ గా తీసుకుందామనుకున్న వారు కూడా ఆర్ డీ ఎక్స్ లవ్ తర్వాత వెనక్కి తగ్గారు. దానివల్ల పాయల్ చాలా ఆఫర్స్ ని కోల్పోయిందని టాక్. అయితే ఆ తర్వాత వెంకీమామా, డిస్కోరాజా చిత్రంలో చేసిన పాత్రలకి అంతగా గుర్తింపు దక్కలేదు. తాజా సమాచారం ప్రకారం పాయల్ రాజ్ పుత్, గ్లామర్ రోల్స్ లో కనిపించనంటుంది. గ్లామర్ పాత్రలు చేయడం వల్ల లాంగ్ రన్ లో కెరీర్ ని నిలబెట్టుకోలేమని గుర్తించిందట.

అందువల్ల అలాంటి పాత్రలు కాకుండా నటనకి ఆస్కారమున్న రోల్స్ లో నటించాలనుకుంటుందట. ఈ విషయమై పాయల్ తన మేనేజర్లకి స్ట్రిక్టు రూల్స్ పాస్ చేసిందట. గ్లామర్ షో, స్పెషల్ సాంగ్స్.. వంటి వాటిని పక్కన పెట్టి హీరోయిన్ గా ఎక్కువకాలం నిలబడడానికి ప్రయత్నం చేస్తుందట. మరి ఈ ప్రయత్నంలో పాయల్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Payal wont work only glamour roles..!:

Payal wont work only glamour roles..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ