Advertisementt

బుట్టబొమ్మ క్రియేట్ చేసిన మరో రికార్డు..

Sat 01st Aug 2020 12:42 PM
buttabomma,ala vaikunthapurramulo,allu arjun,trivikram  బుట్టబొమ్మ క్రియేట్ చేసిన మరో రికార్డు..
Buttabomma song created another record.. బుట్టబొమ్మ క్రియేట్ చేసిన మరో రికార్డు..
Advertisement
Ads by CJ

ఒక సినిమాలోని పాటలన్నింటిలో ఒకటి లేదా రెండు మాత్రమే సూపర్ సక్సెస్ అవుతుంటాయి. సినిమాలోని పాటలన్నీ ఒకే రేంజ్ లో హిట్ కావడం చాలా అరుదు. ఆ అరుదైన విషయం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకి జరిగింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాటలు ఎంత సక్సెస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. సామజవరగమనా మొదలుకుని రాములో రాములా, బుట్టబొమ్మ, ఓ మై డాడీ, సిత్తరాల సిరపడు మొదలగు అన్ని పాటలు సూపర్ హిట్టే.

అయితే ఈ పాటలన్నీ ప్రత్యేకమైనవే అయినప్పటికీ బుట్టబొమ్మ పాట ఇంకా స్పెషల్. టిక్ టాక్, డబ్ స్మాష్ వంటి వాటి ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. థమన్ సంగీతం, రామజోగయ్య సాహిత్యం ఇంకా అల్లు అర్జున్ డాన్సులు, పూజా గ్లామర్.. ఇవన్నీ కలిసి ఈ పాటని మరో రేంజ్ కి తీసుకెళ్ళాయి. యూట్యూబ్ లో సంచలనం రేపుతున్న ఈ పాట సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ యూట్యూబ్ లో 300మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న ఈ పాట అతి తక్కువ టైమ్ లో ఆ ఫీట్ సాధించిన తెలుగు పాటగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

Buttabomma song created another record..:

Buttabomma song created another record..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ