Advertisementt

బన్నీ- కొరటాల సినిమాలో గ్యాస్ లీక్ ఉదంతం..?

Sat 01st Aug 2020 02:28 AM
allu arjun,bunny,aa21,koratala shiva,sudhakar mikkilineni  బన్నీ- కొరటాల సినిమాలో గ్యాస్ లీక్ ఉదంతం..?
BUnny Koratala movie inspired from..? బన్నీ- కొరటాల సినిమాలో గ్యాస్ లీక్ ఉదంతం..?
Advertisement
Ads by CJ

అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్, తన తర్వాతి చిత్రాన్ని సుకుమార్ తో చేస్తున్నాడు. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళకుండానే అల్లు అర్జున్ కొరటాల శివతో సినిమా ప్రకటించేసాడు. బన్నీ- కొరటాల కాంబినేషన్ పై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఆ వార్తలని నిజం చేస్తూ అల్లు అర్జున్, కొరటాలతో సినిమా అనౌన్స్ చేసాడు. కొరటాల శివ సినిమా అంటే సామాజిక సందేశం ఖచ్చితంగా ఉంటుంది. కమర్షియల్ అంశాలని మిక్స్ చేస్తూ ప్రేక్షకులకి గట్టీ సందేశాన్ని ఇవ్వడంలో కొరటాల శివ సక్సెస్ అవుతూ ఉంటాడు. బన్నీ- కొరటాల కాంబినేషన్లో రూపొందే సినిమాలోనూ సామాజిక సందేశం ఉండనుందట. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా ప్రేరణ పొంది ఈ కథని రూపొందించాడని అంటున్నారు.

వైజాగ్ గ్యాస్ లీక్ ఉదంతం గురించి అందరికీ తెలిసిందే. దీని ప్రేరణతో ఫ్యాక్టరీలు గ్రామాలని ఎలా కలుషితం చేస్తున్నాయో చూపిస్తాడని అంటున్నారు. బన్నీ స్టూడెంట్ లీడర్ గా కనిపించి గ్రామాలని కాపాడడానికి వస్తాడట. ప్రస్తుతం ఇంకా స్క్రిప్టు వర్క్ జరుగుతోందట. మరి సోషల్ మీడియాలో చర్చిస్తున్న ఈ అంశం నిజమో కాదో తెలియాలంటే మళ్ళీ అప్డేట్ వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.

BUnny Koratala movie inspired from..?:

BUnny Koratala movie inspired from..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ