Advertisementt

హరీష్ శంకర్ సౌండ్స్ గుడ్ అంటున్నాడు..

Sat 01st Aug 2020 02:11 AM
harish shankar,sounds good,podcast,telugu  హరీష్ శంకర్ సౌండ్స్ గుడ్ అంటున్నాడు..
Harish Shankar says Sounds good.. హరీష్ శంకర్ సౌండ్స్ గుడ్ అంటున్నాడు..
Advertisement
Ads by CJ

లాక్ డౌన్ టైమ్ లో సినిమా షూటింగులు లేక ఇంటిపట్టునే ఉంటున్న సినిమా వాళ్ళు తమలోని నైపుణ్యాలని మరింత అభివృద్ధి చేసుకునే పనిలో పడ్డారు. కొత్త భాషలని నేర్చుకోవడంతో పాటు డ్రాయింగ్, పెయింటింగ్ మొదలగు వాటిలో నైపుణ్యాలని పెంచుకుంటున్నారు. అయితే సినిమా దర్శకులు కొత్త స్క్రిప్టులని రాసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. అలా రాయడమే కాకుండా తమకి నచ్చిన ఆలోచనల్ని అభిమానులతో పంచుకోవడానికి ముందుకు వస్తున్నారు.

తమ జీవితంలో జరిగిన సంఘటనలని, జీవితంపై తమ అభిప్రాయాలని వెల్లడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి వారికి పోడ్ కాస్ట్ లు చాలా ఉపయోగపడుతున్నాయి. రేడియో వింటున్నట్టుగా అనిపించే ఈ పోడ్ కాస్ట్ లకి ఆదరణ చాలా పెరుగుతోంది. మొన్నటికి మొన్న పూరి జగన్నాథ్, మ్యూజింగ్స్ ని పోడ్ కాస్ట్ ల రూపంలో రిలీజ్ చేసాడు. అయితే తాజాగా తన అభిప్రాయాలని శ్రోతలతో పంచుకోవడానికి దర్శకుడు హరీష్ శంకర్ ముందుకు వస్తున్నాడు. ఈ పోడ్ కాస్ట్ లకి సౌండ్స్ గుడ్ అనే పేరు పెట్టాడు. ఇందులో హరీష్ ఆలోచనలతో పాటుగా సెలెబ్రిటీలతో జరిపిన సంభాషణలు కూడా ఉంటాయట.

Harish Shankar says Sounds good..:

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ