Advertisementt

బిగ్ బాస్ లో ఆ హీరోయిన్లు డౌటే..?

Fri 31st Jul 2020 01:55 PM
biggbosstelugu4,sree rapaka,poonam kaur,swetha basu prasad,television  బిగ్ బాస్ లో ఆ హీరోయిన్లు డౌటే..?
Those heroines are not part of Bigg Boss4? బిగ్ బాస్ లో ఆ హీరోయిన్లు డౌటే..?
Advertisement
Ads by CJ

తెలుగు టీవీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ దక్కించుకున్న షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగవ సీజన్ చాలా ఆసక్తిగా ఉండనుంది. అయితే ఈ సీజన్లో కంటెస్టెంట్లుగా ఎవరొస్తున్నారనే విషయమై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. బిగ్ బాస్ ద్వారా వచ్చే పాపులారిటీ కోసమని సెలెబ్రిటీలు సైతం హౌస్ లోకి రావడానికి ఇష్టపడతారు.

సినిమా, టీవీ, యూట్యూబ్ లో పేరొందిన స్టార్లని హౌస్ లోకి తీసుకువచ్చి ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దడానికి బిగ్ బాస్ బృందం కూడా రెడీ అవుతోంది. ఇప్పటికే సెలెక్షన్ పార్ట్ పూర్తయిపోయిందట. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ కూడా పూర్తయింది. ఇక కరోనాటెస్టులు నిర్వహించి, అంతా ఓకే అనుకున్నాక అధికారికంగా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది వెల్లడి చేస్తారట.

అయితే కంటెస్టెంట్లుగా చాలా మంది పేర్లు వినిపించాయి. వారందరిలో ఎవరెవరు హౌస్ లో ఉంటారో షో స్టార్ట్ అయితేగానీ చెప్పలేం. ప్రస్తుత సమాచారం ప్రకారం కంటెస్టెంట్లుగా వినిపించిన చాలా మందిలో ఒక ముగ్గురు మాత్రం హౌస్ లోకి వెళ్ళడం లేదని అంటున్నారు. ఆ ముగ్గురే పూనర్ కౌర్, శ్రీ రాపాక, శ్వేత బసు ప్రసాద్.. ఈ ముగ్గురు కూడా హౌస్ లోకి రావడం లేదని ప్రచారం జరుగుతోంది. అదెంతవరకూ నిజమో షో స్టార్ట్ అయితేనే తెలుస్తుంది.

Those heroines are not part of Bigg Boss4?:

Those heroines are not part of Bigg Boss4?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ