తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మిడ్ రేంజ్ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న నిఖిల్, మరో సినిమాని కన్ఫర్మ్ చేసాడు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు సినిమాలున్న సంగతి అందరికీ తెలిసిందే. తన కెరీర్లో మంచి హిట్ గా నిలిచిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న కార్తికేయ2 సినిమాతో పాటు సుకుమార్ రాసిన కథతో 18పేజెస్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ రెండు చిత్రాల చిత్రీకరణ ఆగిపోయింది.
అయితే ప్రస్తుతం మరో సినిమాని ప్రకటించాడు. నిఖిల్ కెరీర్లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ రూపొందిస్తుంది. కే నారయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ ఎమ్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎవరు చేస్తున్నారనేది ప్రకటించలేదు. హీరోయిన్, ఇతర నటీనటులతో పాటు ఇతర సాంకేతిక నిపుణుల పేర్లని మరికొద్ది రోజుల్లో వెల్లడి చేస్తారట.