Advertisementt

అల్లు అర్జున్ ఐకాన్ ఏమైనట్లు..?

Fri 31st Jul 2020 12:27 PM
allu arjun,icon,venu sriram,koratala shiva  అల్లు అర్జున్ ఐకాన్ ఏమైనట్లు..?
What about Allu Arjun Icon Movie..? అల్లు అర్జున్ ఐకాన్ ఏమైనట్లు..?
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత అల్లు అర్జున్ సంవత్సరం దాకా గ్యాప్ తీసుకుని మరీ చేసిన అల వైకుంఠపురములో సినిమా నాన్ బాహుబలి హిట్ గా నిలిచింది. అయితే అల వైకుంఠపురములో సెట్స్ పై ఉండగానే ఐకాన్ అనే టైటిల్ తో సినిమాని ప్రకటించాడు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందని వెల్లడించారు. 

అయితే అల వైకుంఠపురములో తర్వాత ఐకాన్ ని పక్కన పెడుతూ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప సినిమా స్టార్ట్ చేసాడు. అటు డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ మొదలు పెట్టాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే ఐకాన్ వచ్చే ఏడాది ఉంటుందని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఐకాన్ ఇక ఉండదేమోననిపిస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్ తన 21వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించేసాడు.

ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తో కలిసి కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ యువసుధ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దీనికి అల్లు అర్జున్ ఫ్రెండ్స్ శాండీ - స్వాతి - నట్టి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా 2022 మొదట్లో విడుదల అవుతుందని ప్రకటించారు. దీంతో ఇక ఐకాన్ కనబడుటలేదు అనే చిత్రం ప్రేక్షకులకి కనిపించకుండా పోయేలా ఉంది. మరి చూడాలి ఏం జరగనుందో..!   

What about Allu Arjun Icon Movie..?:

What about Allu Arjun Icon Movie..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ