ప్రభాస్ బాహుబలితో భారీగా క్రేజ్ సంపాదించుకుని సాహోతో దానిని అందుకునే ప్రయత్నంలో విఫలమయ్యాడు. సాహో తర్వాత పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ కాంబోలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత బాలీవుడ్ నటుల మీదే ఫోకస్ చేసిన ప్రభాస్‌కి అక్కడి హీరోయిన్స్ అంతగా అచ్చి రావడం లేదు కానీ.. ప్రభాస్ మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్ వెంటే పడుతున్నాడు. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు కాస్త టెన్షన్ పడుతున్నారు. మొదటి నుండి అంటే ఏక్ నిరంజన్ అప్పటినుండి.. బాలీవుడ్ హీరోయిన్స్ ప్రభాస్‌కి అచ్చి రావడం లేదు. ఏక్ నిరంజన్‌లో కంగనా రనౌత్, అలాగే సాహో సినిమాలో శ్రద్దా కపూర్ కూడా అంతే అయ్యింది. ఆ సినిమాలు మరీ అట్టర్ ప్లాప్ అవడంతో.. ఇప్పుడు నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబోపై ప్రభాస్ ఫ్యాన్స్‌కి కంగారు పుడుతుంది.
నాగ్ అశ్విన్ ప్రభాస్ మూవీ కోసం బాలీవుడ్ భామ దీపికా పదుకొనేని తీసుకొచ్చాడు. భారీ పారితోషకం, భారీ కండిషన్స్ అయినా తగ్గలేదు. కానీ ఇప్పుడు ప్రభాస్ పాత గాయాలను వెలికి తీసిన ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. దీపికా అంటే క్రేజ్ ఉన్న హీరోయిన్. కథలో బలముంటేనే కదా ఆమె ఒప్పుకునేది. అయినా ఇప్పడు కంగారు ఎందుకు నాగ్ అశ్విన్ మీదే భారం వెయ్యండి అని కొంతమంది అంటుంటే... ప్రభాస్ కి అచ్చిరాని హీరోయిన్స్ ఎందుకు.. హాయిగా సౌత్ హీరోయిన్‌తో పని కానిచ్చేసే దానికి అంటున్నారు. మరి ప్రభాస్ - దీపికా కాంబో అయినా ప్రభాస్ ఫ్యాన్స్ సెంటిమెంట్‌ని బ్రేక్ చెయ్యాలి.. లేదంటే.. అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ వేరుగా ఉంటుంది మరి.