Advertisementt

అబ్బే అదేం లేదు.. చిరు ఫుల్ హ్యాపీ!

Fri 31st Jul 2020 01:53 PM
chiranjeevi,full happy,sujiths remake script,lucifer remake,director sujith,chiru-sujith movie  అబ్బే అదేం లేదు.. చిరు ఫుల్ హ్యాపీ!
Chiranjeevi Full Happy sujiths remake Script అబ్బే అదేం లేదు.. చిరు ఫుల్ హ్యాపీ!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్‌ మూవీకి డైరెక్టర్‌గా సుజిత్‌ను ఎంచుకున్న విషయం తెలిసిందే. అయితే స్టోరీ మార్పులు చేర్పుల విషయంలో ఎక్కడో తేడా కొట్టిందని సుజిత్‌ను చిరు పక్కనెట్టారని.. మరోవైపు మెగాస్టార్‌కు స్టోరీ వినిపించగా ఆయన నచ్చనలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్‌ను ఎంచుకున్నారని గత వారం రోజులుగా ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియా, వెబ్ సైట్లలో ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన వార్తలే. అంతేకాదు.. మెగాస్టార్ సినిమా నుంచి తప్పుకున్న కొన్ని గంటలకే సుజిత్‌కు బంపరాఫర్ వచ్చిందని.. ఈ కథను యూవీ క్రియేషన్ వారు నిర్మించేందుకు ముందుకొచ్చారని కూడా వార్తలు వచ్చాయి. ఆ సినిమా మల్టీ స్టారర్ మూవీ అని ఇందులో ఇద్దరు యంగ్ హీరోలను తీసుకుని చేస్తాడని టాలీవుడ్‌లో టాక్ నడిచింది.

అయితే.. తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై మెగా కాంపౌండ్ నుంచి క్లారిటీ వచ్చేసింది. స్క్రిప్ట్ నచ్చలేదని సుజిత్‌ను పక్కనెట్టారన్న పుకార్లలో నిజం లేదని.. అవన్నీ అవాస్తవాలే అని మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం. యంగ్ డైరెక్టర్ పనితీరు పట్ల చిరు చాలా సంతృప్తిగా ఉన్నారట. అంతేకాదు.. తాను మనసు పడి చేస్తున్న ఈ ‘లూసీఫర్’ చిత్రానికి సుజితే డైరెక్టర్ అని చిరు కూడా ఫిక్సయిపోయారట. సో.. రీమేక్ మూవీ డైరెక్టర్ విషయంలో ఎలాంటి మార్పుల్లేవన్న మాట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘ఆచార్య’ షూటింగ్ అవ్వగానే సుజిత్‌తో మూవీ ట్రాక్ ఎక్కనుందట. మొత్తానికి చూస్తే గత కొన్ని రోజులుగా వచ్చిన పుకార్లకు మెగా కాంపౌండ్ నుంచి సమాచారంతో ఫుల్ స్టాప్ పడిపోయినట్లే అన్న మాట.

Chiranjeevi Full Happy sujiths remake Script:

Chiranjeevi Full Happy sujiths remake Script  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ