Advertisementt

జబర్దస్త్‌కి ‘అదిరింది’ చెక్ పెట్టినా పెట్టొచ్చు!

Fri 31st Jul 2020 09:52 AM
nagababu,adhirindi show,roja,jabardasth,lock down,entertainment  జబర్దస్త్‌కి ‘అదిరింది’ చెక్ పెట్టినా పెట్టొచ్చు!
No Entertainment in Jabardasth after Lock down జబర్దస్త్‌కి ‘అదిరింది’ చెక్ పెట్టినా పెట్టొచ్చు!
Advertisement
Ads by CJ

నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాక జీ ఛానల్ లో అదిరింది షో మొదలు పెట్టించాడు. కర్త కర్మ క్రియ అన్ని అదిరిందికి నాగబాబు అనేలా ప్రచారం జరిగింది. జబర్దస్త్‌కి చుక్కలు చూపించడం ఖాయమనుకుని జబర్దస్త్‌ని ఎత్తిపోశాడు నాగబాబు కానీ అదిరింది షోకి అనుకున్న టీఆర్పీలు రాలేదు. జబర్దస్త్ ముందు ప్రతి వారం అదిరింది షో వెలవెలబోతూనే ఉంది. అయితే తాజాగా అంటే కరోనా లాక్‌డౌన్ ముగిసాక అదిరింది షో రేటింగ్స్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. జబర్దస్త్‌ని దాటలేకపోయాయని అంటున్నారు. కానీ తాజాగా జబర్దస్త్‌ని క్రాస్ చేసేందుకు అదిరింది రెడీగా ఉందని అంటున్నారు. కారణం జబర్దస్త్ స్కిట్స్‌లో కామెడీ తగ్గడమేనట.

లాక్‌డౌన్ తర్వాత జబర్దస్త్‌లో చాలా మార్పులు చేశారు. చాలా టీం లీడర్స్‌ని తీసేసి.. తాగుబోతు రమేష్‌, షకలక శంకర్ టీమ్స్ తీసుకొచ్చారు. లాక్‌డౌన్ తర్వాత జబర్దస్త్ కామెడీలో పస తగ్గింది అనే టాక్ వినబడుతుంది. గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్‌లో హైపర్ ఆది, శుక్రవారం ప్రసారమయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ స్కిట్స్ తప్ప మిగతా స్కిట్స్ పెద్దగా ఆకట్టుకోవడం లేదని సోషల్ మీడియా టాక్. గురువారం ఆది, శుక్రవారం సుధీర్ స్కిట్స్ మినహా మిగిలిన టీమ్‌లకు యూట్యూబ్‌లో పెద్దగా వ్యూస్ రావడం లేదని చెబుతున్నారు. అదే టైం లో చమ్మక్ చంద్ర వల్ల అదిరింది షో దూసుకుపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ తర్వాత అదిరింది షోలో చిన్న మార్పులు తప్ప మేజర్ మార్పులేమీ చెయ్యలేదు. అదిరింది షో లో సద్దాం టీమ్ గల్లీ బాయ్స్, హరి టీమ్ రౌడీ బాయ్స్ అదరగొట్టేస్తున్నాయి. యూట్యూబ్ లోను వీరి స్కిట్స్ కి మంచి వ్యూస్ రావడంతో.. జబర్దస్త్‌కి త్వరలోనే అదిరింది చెక్ పెట్టినా పెట్టొచ్చు అని అంటున్నారు.

No Entertainment in Jabardasth after Lock down:

Nagababu adhirindi show beats Roja Jabardasth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ