నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబోలో తెరకెక్కబోయే సోషియో ఫాంటసీ మూవీ కోసం బాలీవుడ్ బడా హీరోయిన్ దీపికా పదుకొనేని తీసుకొస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో ప్రభాస్‌కి తగిన రాణి దీపికానే అని నాగ్ అశ్విన్ నమ్ముతున్నాడు. అదే విషయం చెప్పాడు కూడా. అయితే దీపికా పదుకొనే ప్రభాస్ సినిమా కోసం అనేక కండీషన్స్ పెట్టడమే కాకుండా పారితోషికం పరంగా 30 కోట్లు డిమాండ్ చేస్తే.. 20 కోట్లకి ఒప్పించారనే టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్‌కి సరిసమానమైన పాత్ర దీపికా పదుకొనేకి ఉండబోతుంది. అందుకే దీపికా పదుకొనే కూడా ప్రభాస్ సినిమా చెయ్యడానికి ఒప్పుకుంది అని అంటున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ సినిమా మూడో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఉండబోతుందట.
అయితే ఈ సినిమాలో దీపికా పదుకొనే మెయిన్ లీడ్ హీరోయిన్ కాగా.. మరొక హీరోయిన్‌కి కూడా కథ రీత్యా ఛాన్స్ ఉందట. అయితే ఆ సెకండ్ హీరోయిన్‌ని నాగ్ అశ్విన్ సౌత్ నుంచి తీసుకోబోతున్నాడని.. అయితే ఎక్కువ ప్రాధాన్యత లేకపోయినా.. ఉన్నంతలో సెకండ్ హీరోయిన్‌కి మంచి సీన్సే ఉంటాయని అంటున్నారు. ప్రభాస్‌కి సెకండ్ హీరోయిన్‌తో ఓ డ్యూయెట్ కూడా ఉంటుంది అని అంటున్నారు. మరి ప్రభాస్‌కి సరైన జోడి దీపికా పదుకొనే వన్ అఫ్ ద హీరోయిన్. మరి నాగ అశ్విన్ ఇప్పుడు సెకండ్ హీరోయిన్‌గా ఏ సౌత్ బేబీని తీసుకొస్తాడో అనే ఆసక్తి అందరిలో పెరిగిపోతుంది.