నిర్మాత వల్లూరుపల్లి రమేష్ కుమారుడు మహర్షి వివాహ మహోత్సవం
ప్రముఖ నిర్మాత వల్లూరుపల్లి రమేష్ బాబు కుమారుడు రాఘవేంద్ర మహర్షి వివాహమహోత్సవం ఈ బుధవారం సాయంత్రం హైదరాబాద్ అవాస హోటల్లో జరిగింది. మహర్షి- శ్రీజ జంటను ఆశీర్వదించేందుకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సాంబశివరావు- శ్రీదేవి దంపతుల కుమార్తె శ్రీజ. శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్, ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్, సురేష్ కొండేటి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రభుత్వ మార్గదర్శకాల కారణంగా.. కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగిందని వల్లూరుపల్లి రమేష్ బాబు - గీత దంపతులు వెల్లడించారు.
ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి, కబడ్డీ కబడ్డీ, సైలెన్స్ ప్లీజ్, పందెం సహా పలు విజయవంతమైన చిత్రాల్ని వల్లూరుపల్లి రమేష్ బాబు నిర్మించారు.