బిగ్ బాస్ నాలుగవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుందని తెలిసిందే. ఎన్నో అనుమానాల మధ్య ఎట్టకేలకు నాలుగవ సీజన్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ నాలుగవ సీజన్లో కంటెస్టెంట్లుగా వచ్చే సెలెబ్రిటీలపై ఎన్నో వార్తలు వస్తున్నాయి. సింగర్ సునీత, నోయల్ సేన్, ఫోక్ సింగర్ మంగ్లీ... బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే హోస్ట్ విషయమై క్లారిటీ వచ్చేసినట్టే అనిపిస్తోంది.
మూడవ సీజన్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేసిన నాగార్జున, నాలుగవ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సారి చాలా షరతులు పెట్టాడట. అంతే కాదు రెమ్యునరేషన్ విషయంలో కొత్త కాన్సెప్ట్ తో వచ్చాడని ప్రచారం జరుగుతోంది. సీజన్ మొత్తానికి ఒకేసారి కాకుండా ఎపిసోడ్ పరంగా పారితోషికం తీసుకోనున్నాడని వినిపిస్తోంది.
ఒక్క ఎపిసోడ్ కి 12లక్షల వరకు తీసుకోనున్నాడట. అంటే బిగ్ బాస్ సీజన్ పూర్తయ్యే సరికి భారీగానే అందుతుందన్నమాట. కోవిడ్ టైమ్ లో థియేటర్లు లేక ఎంటర్ టైన్ మొత్తం ఓటీటీకే పరిమితమైన సమయంలో బిగ్ బాస్ కి భారీగా టీఆర్పీ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో నాగార్జున ఎపిసోడ్ కి 12లక్షలు తీసుకోవడం ఏమంత ఎక్కువ మొత్తం కాదని అంటున్నారు. చూడాలి మరేం జరగనుందో.!