Advertisementt

వెంకటేష్.. ఇక వచ్చే ఏడాదే..?

Wed 29th Jul 2020 04:55 PM
venkatesh,narappa,srikanth addala,telugu  వెంకటేష్.. ఇక వచ్చే ఏడాదే..?
Venkatesh to resume Narappa Shoot from..? వెంకటేష్.. ఇక వచ్చే ఏడాదే..?
Advertisement
Ads by CJ

ఎఫ్ 2, వెంకీమామా సినిమాలతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన వెంకటేష్, ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ధనుష్ హీరోగా నటించిన తమిళ చిత్రం అసురన్ కి తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లకి మంచి స్పందన లభించింది. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తుంది.

అనంతపురం ప్రాంత నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ సగభాగం పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా ఆగిపోయిన చిత్రీకరణ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందనే విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. టీవీ, సినిమా షూటింగులకి ప్రభుత్వం నుండి అనుమతులు లభించినప్పటికీ కరోనా కేసులు ప్రతీరోజూ పెరుగుతూనే ఉన్నందు వల్ల ఇప్పట్లో చిత్రీకరణ మొదలు పెట్టే అవకాశం కనిపించడం లేదు.

తాజా సమాచారం ప్రకారం వెంకటేష్, నారప్ప షూటింగ్ లో సంక్రాంతికి పాల్గొంటాడట. అంటే మరో ఐదు నెలల వరకు చిత్రీకరణని వాయిదా వేసుకోవాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాంగ్ గ్యాప్ అయితేనే బాగుంటుందని ఫీల్ అవుతున్నారట. మరి జనవరిలో షూటింగ్ స్టార్ట్ అయితే వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారేమో..!

Venkatesh to resume Narappa Shoot from..?:

Venkatesh to resume Narappa Shoot from..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ