ప్రభాస్‌కి బాలీవుడ్‌లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో.. బాహుబలి తర్వాత వచ్చిన సాహోతో పూర్తిగా అర్ధమయ్యింది. ప్లాప్ సినిమాకే అక్కడి ప్రేక్షకులు పట్టం కట్టారు కాబట్టే ప్రభాస్ నెక్స్ట్ సినిమాలపై బాలీవుడ్‌లో భీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. ప్రభాస్ రాధేశ్యామ్ ఫస్ట్ లుక్‌కి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న రాధేశ్యామ్ బాలీవుడ్ హక్కుల కోసం ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు ఎగబడుతున్నట్టుగా న్యూస్. ఈమధ్యనే విడుదలైన రాధేశ్యామ్ ఫస్ట్ లుక్‌కి విశేషమైన స్పందన రావడంతో.. రాధేశ్యామ్ బాలీవుడ్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది.
బాలీవుడ్‌లో బడా నిర్మాతలైన కరణ్ జోహార్ ప్రభాస్ రాధేశ్యామ్ హక్కుల కోసం బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నాడట. గతంలో ప్రభాస్ బాహుబలి సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలకు కరణ్ జోహార్ బాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. ఆ సినిమాకి కరణ్‌కి కాసుల వర్షం కురిసింది. తర్వాత సాహో విషయం ఎలా ఉన్నా ఇప్పుడు రాధేశ్యామ్ హక్కుల కోసం కరణ్ జోహార్ పావులు కడుపుతున్నాడట. ఇలాంటి టైం లో మరో నిర్మాత కూడా రాధేశ్యామ్ హక్కుల విషయంలో పోటీపడుతున్నట్లుగా న్యూస్ వినిపిస్తుంది. ఇలాంటి పోటీ వాతావరణంలో రాధేశ్యామ్ బాలీవుడ్ హక్కులు ఓ రేంజ్ లో అమ్ముడు పోవడం ఖాయమంటున్నారు. మరి ప్రభాస్ రాధేశ్యామ్ విషయంలో ఎలాంటి రికార్డులు నమోదవుతాయో కరోనా పూర్తయితే కానీ పక్కా క్లారిటీ రాదు అంటున్నారు నిపుణులు.