డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నా.. ఛానల్స్ మాత్రం సినిమాల శాటిలైట్ రైట్స్ విషయంలో పోటీని తగ్గించుకోవడం లేదు. మంచి ఫీల్ ఉన్న సినిమాలకు, స్టార్ హీరోల సినిమాలకు ఛానల్స్ ఎప్పుడూ పోటిగానే ఉంటాయి. కావాల్సిన ధరలను నిర్మాతలకు చెల్లించి శాటిలైట్ హక్కులను ఎగరేసుకుని పోతుంటాయి. తాజాగా నాగ చైతన్య లవ్ స్టోరీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాల శాటిలైట్ రైట్స్‌ని స్టార్ మా ఫాన్సీ ధరకు దక్కించుకున్నట్టుగా చెబుతున్నారు. చైతు సినిమాకి శేఖర్ కమ్ముల ఫిదా హిట్, సాయి పల్లవి హీరోయిన్ కావడం ఒక క్రేజ్ అయితే... లవ్ స్టోరీపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక అఖిల్ కి వరసగా ప్లాప్స్ ఉన్నప్పటికీ.. బొమ్మరిల్లు భాస్కర్ కి ప్లాప్స్ ఉన్నప్పటికీ.. హీరోయిన్ గా పూజా హెగ్డే ఉండడం, ప్రస్తుతం ఆమె క్రేజ్ భీభత్సంగా ఉండటం, అలాగే ఈ సినిమాని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ వారు నిర్మించడంతో.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌పై భారీ హోప్స్ ఉండడంతోనే స్టార్ మా అఖిల్ సినిమాని కూడా కొనేసింది. ఇక అన్నదమ్ముల సినిమాలను రెండింటిని స్టార్ మా దక్కించుకోవడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయంటున్నారు. చైతు - సాయి పల్లవి జంటపై ఉన్న క్రేజ్.. అఖిల్ - పూజ హెగ్డే జంటపై ఉన్న క్రేజ్ తోనే ఈ సినిమాలకు మంచి ధర లభించినట్టుగా ఫిలింనగర్ టాక్.