పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ ఎప్పుడు అంటే... కరోనా వ్యాక్సిన్ రావాల్సిందే అన్నాడు. అంటే కరోనాకి వ్యాక్సిన్ వచ్చేవరకు పవన్ సెట్స్ మీదకి రాడు. అది ఫిక్స్. అయితే వకీల్ సాబ్ ఎప్పుడు మొదలైతే అప్పుడే క్రిష్ సినిమా కూడా మొదలవుతుంది. అయితే క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి ఇంకా హీరోయిన్ సెట్ కాలేదు. అయినా క్రిష్ ఇంకా రివీల్ చెయ్యలేదు. ఈలోపు రకరకాల పేర్లు తెర మీదకొస్తున్నాయి. అందులో తాజాగా రకుల్ ప్రీత్.. పవన్ - క్రిష్ కాంబో మూవీలో హీరోయిన్‌గా క్రిష్ అండ్ టీం సంప్రదించినట్లుగా వార్తలొస్తున్నాయి. మిగతా హీరోయిన్స్‌ని బుక్ చేయాలంటే.. కరోనా కారణంగా ముందు ఒప్పుకున్న సినిమాలు.. కరోనా తగ్గాక మొదలైతే డేట్స్ ఖాళీ ఉండవు.
అందుకే అవకాశాలు లేని రకుల్ అయితే పర్ఫెక్ట్ అని క్రిష్ భావిస్తున్నాడట. ఎలాగూ రకుల్ కి తెలుగులో సినిమాలు లేవు. బాలీవుడ్ లో ఉన్న చిన్న చిన్న సినిమాలు అంతలోపు పూర్తవుతాయి. అందుకే క్రిష్ సినిమాలో రకుల్ కోసం ప్రయత్నాలు మొదలెట్టారట. మరసలే ఖాళీగా ఉన్న రకుల్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవకాశం దొరికితే ఎగిరి గంతెయ్యాల్సిందే. ఎందుకంటే కొత్త హీరోయిన్ల తాకిడితో రకుల్ కి తెలుగు, తమిళంలో అవకాశాలు తగ్గుతున్నాయి. ఇలాంటి టైం లో ఈ ముద్దుగుమ్మకి పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం రావడం విశేషం అని చెప్పాలి.