ఏది జరగకూడదని అనుకున్నారో అదే జరిగింది. కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిలిచిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందనే విషయమై ప్రతీరోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కరోనాతో సహజీవనం తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం సూచించిన నియమాల ప్రకారం చిత్రీకరణ జరపాలని రాజమౌళి భావించాడు. అందుకోసం టెస్ట్ షూట్ చేద్దామని ప్రయత్నించాడు కూడా. కానీ కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో టెస్ట్ షూట్ కూడా సాధ్యం కాదని నిర్ణయించి క్యాన్సిల్ చేసుకున్నాడు.
కానీ కరోనా తాకిడి రాజమౌళిని తాకింది. అవును రాజమౌళి కరోనా బారిన పడ్డాడు. గత కొన్ని రోజులుగా చిన్న జ్వరంతో బాధపడుతున్న రాజమౌళి కుటుంబ సభ్యులు కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అయితే ఈ టెస్ట్ లో వారికి పాజిటివ్ వచ్చిందట. ఈ మేరకు ఈ సమాచారాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ప్రస్తుతానికి వారికి పెద్దగా కరోనా లక్షణాలు లేవని, వైద్యుల సలహా మేరకు క్వారంటైన్ లో ఉన్నామనీ, రోగనిరోధక శక్తిని పెంచుకుని కరోనా నుండి బయటపడి ప్లాస్లా డొనేట్ చేసేందుకు సిద్ధం అవుతామని వెల్లడించాడు.