Advertisementt

బాలయ్య, బోయపాటి ఫిల్మ్‌పై షాకింగ్ వార్త!

Wed 29th Jul 2020 09:14 AM
balakrishna,boyapati srinu,bellamkonda srinivas,special role  బాలయ్య, బోయపాటి ఫిల్మ్‌పై షాకింగ్ వార్త!
Shocking news about Balayya and Boyapati Film బాలయ్య, బోయపాటి ఫిల్మ్‌పై షాకింగ్ వార్త!
Advertisement
Ads by CJ

రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యేసరికి బోయపాటి - బాలయ్య కాంబో పై ఎక్కడాలేని అంచనాలు వచ్చేశాయి. ముచ్చటగా మూడోసారి తెరకెక్కబోయే ఈ కాంబోపై అందరిలో ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పటికే విడుదలైన BB3 టీజర్ అందరిలో భీభత్సమైన అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరాగా అదరగొట్టేస్తాడని, సెకండ్ హాఫ్‌లో అఘోర పాత్రలో బాలయ్య చేయబోయే రచ్చ అంత ఇంతా కాదని.. అదే సినిమాకి మెయిన్ హైలెట్ అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య కోసం బోయపాటి ముంబై మోడల్‌ని తీసుకురాబోతున్నాడనే స్పష్టత ఇచ్చింది చిత్ర బృందం.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న షాకింగ్ రూమర్ ఏంటంటే ఈ సినిమాలో బెల్లకొండ శ్రీనివాస్ ఓ స్పెషల్ కేరెక్టర్ చేస్తున్నాడని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ వస్తాడని, బోయపాటి ఓ యాక్షన్ ఎపిసోడ్ ని బెల్లంకొండ శ్రీనివాస్ కి రాసుకున్నాడని అంటున్నారు. బెల్లంకొండతో గతంలో బోయపాటి జయ జానకి నాయక సినిమా చేసాడు. అయితే బోయపాటి అడగగానే బెల్లంకొండ శ్రీనివాస్ బాలయ్య సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడని టాక్ ఉండగా.. ఈ సినిమాలో బాలయ్య ఇంకో కేరెక్టర్ కి తమిళ హీరోయిన్ స్నేహ నటిస్తుందట. ఇందులో బాలయ్య భార్యగా స్నేహ నటిస్తుందనేది తాజా న్యూస్.

Shocking news about Balayya and Boyapati Film:

Bellamkonda Srinivas in BB3 Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ