Advertisementt

బహుముఖ మేధావిని కోల్పోయాం: చిరంజీవి

Tue 28th Jul 2020 11:07 PM
mega star chiranjeevi,kondala rao,tribute,chantabbai,mantrigari viyyankudu  బహుముఖ మేధావిని కోల్పోయాం: చిరంజీవి
Mega Star Chiranjeevi Pays tribute to Raavi Kondala Rao బహుముఖ మేధావిని కోల్పోయాం: చిరంజీవి
Advertisement
Ads by CJ

‘‘ప్రముఖ నటులు, రచయిత, జర్నలిస్ట్, ప్రయోక్త రావి కొండలరావు గారి ఆకస్మిక మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమతో రావి కొండలరావుగారికి సుదీర్ఘ అనుబంధం ఉంది. నేను హీరోగా పరిచయం అయిన తొలినాళ్ళనుండి రావి కొండలరావుగారితో పలు చిత్రాల్లో నటించడం జరిగింది. ముఖ్యంగా మా కాంబినేషన్‌లో వచ్చిన  చంటబ్బాయి, మంత్రిగారి వియ్యంకుడు వంటి చిత్రాలలో రావి కొండలరావుగారు చాలా కీలక పాత్రలు పోషించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రావి కొండలరావుగారి మరణంతో చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడినే కాదు గొప్ప రచయితను పాత్రికేయున్ని ప్రయోక్తను కోల్పోయింది. 

అలాగే నాటక, సాంస్కృతిక రంగాలకు కూడా రావికొండలరావుగారి మరణం ఒక తీరని లోటు. రావి కొండలరావుగారూ ఆయన సతీమణి రాధాకుమారిగారు జంటగా ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు. చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా ఆ ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లాగ వచ్చి వారి అభినందనలు, ఆశీస్సులు అందించడం చూడముచ్చటగా ఉండేది. అలాంటి రావి కొండలరావుగారి మరణంతో చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’. అని చిరంజీవి తెలిపారు.

Mega Star Chiranjeevi Pays tribute to Raavi Kondala Rao:

Mega Star Chiranjeevi about Raavi Kondala Rao

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ