Advertisementt

కళ్యాణ్ రామ్ ‘రావణ’కు కరోనా లాక్‌డౌన్ కష్టాలు!

Tue 28th Jul 2020 07:07 PM
kalyan ram,raavana film,corona,lock down,set,rent  కళ్యాణ్ రామ్ ‘రావణ’కు కరోనా లాక్‌డౌన్ కష్టాలు!
Corona Lockdown Problems to Kalyan Ram Raavana Film కళ్యాణ్ రామ్ ‘రావణ’కు కరోనా లాక్‌డౌన్ కష్టాలు!
Advertisement
Ads by CJ

కరోనా మహమ్మారి వైరస్‌తో బలి తీస్కోవడం అటుంచి.. దాని వల్ల ఏర్పడ్డ లాక్‌డౌన్ వలన చాలామంది బలి అవుతున్నారు. కరోనా లాక్‌డౌన్ అందరి ప్రాణాల మీదకి తెచ్చింది. పెద్ద మల్టీ నేషనల్ కంపెనీ లేదు.. చిన్న పరిశ్రమ అని లేదు.. ప్రతిదీ కరోనా కారణంగా పడుకున్నాయి. కార్మికులకు పని లేదు.. తినడానికి తిండి లేదు. సినిమా పరిశ్రమ మరింత ఘోరం. పెట్టుబడి పెట్టి సెట్స్ మీదున్న సినిమాల నిర్మాతల నెత్తి మీద చెంగు పడేలా చేసింది కరోనా. పనిలేక సినిమా కార్మికులు అల్లాడిపోతున్నారు. హీరోలు, దర్శకులు, హీరోయిన్స్ పెద్ద పెద్ద వాళ్ళ పని ఓకే కానీ.. నిర్మాతలు చిన్న నటులు పని ఖాళీ. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ నిర్మాతలు ఇప్పుడు ఘొల్లుమంటున్నారు. కారణం స్టూడియో అద్దెలు కట్టలేక చేతులెత్తేశారు.

కళ్యాణ్ రామ్ - నూతన దర్శకుడు మల్లిడి వశిష్ఠ కాంబోలో తెరకెక్కాల్సిన ‘రావణ’ సినిమా కోసం ఓ స్టూడియోలో 2 కోట్లతో ఓ భారీ సెట్ నిర్మించారు. అయితే ఇప్పుడు ఆ స్టూడియో అద్దెలు కట్టలేక నిర్మాతలు ఆ రెండు కోట్ల సెట్‌ని స్టూడియో నుండి తొలగించినట్లుగా తెలుస్తుంది. మరి కళ్యాణ్ రామ్ (రావణ్) కోసం మల్లిడి వశిష్ఠ రెండు కోట్ల రూపాయలతో సెట్ వేయించడమే కాదు.. అందులో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారట. తర్వాత కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోగా... నాలుగు నెలల పాటు వేచి చూసిన నిర్మాతలు తిరిగి షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొన్న పరిస్థితుల దృష్యా సదరు స్టూడియోకి అద్దె కట్టలేక ఆ సెట్ ని తొలగించారని చెబుతున్నారు. 

Corona Lockdown Problems to Kalyan Ram Raavana Film:

Kalyan Ram Raavana Film Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ