ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో పూజా హెగ్డే ప్రథమ స్థానంలో ఉంటుంది. ముకుంద సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ హిట్ సాధించలేకపోయింది. దాంతో అన్ లక్కీ గర్ల్ అనే ట్యాగ్ కూడా వచ్చేసింది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. డీజే, మహర్షి, అరవింద సమేత, అలవైకుంఠపురములో వంటి సినిమాలతో వరుస హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ప్రస్తుతం ఆమె చేతిలో అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ చిత్రంతో పాటు ప్రభా రాధేశ్యామ్ కూడా ఉంది. ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. కరోనా కారణంగా ఈ చిత్రాల షూటింగ్ నిలిచిపోయింది. అయితే స్టార్ హీరోయిన్ గా మారిన పూజా హెగ్డే తన రెమ్యునరేషన్ ని కూడా అందుకు తగ్గట్లుగా మార్చుకుందట. కరోనా కారణంగా సినిమాల్లో నటించే హీరో, హీరోయిన్ల పారితోషికాలు తగ్గించుకోవాలని వార్తలు వస్తున్న కూడా పూజాహెగ్డే తన రెమ్యునరేషన్ ని పెంచిందని టాక్ వినబడుతుంది.
ఆమె తన తర్వాతి చిత్రానికి రెండుకోట్ల రూపాయలు తీసుకోనుందని ప్రచారం చేస్తున్నారు. ఇటు తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ భామ తన పారితోషికాన్ని పెంచిందని అంటున్నారు.