కాజల్ అగర్వాల్ కెరీర్‌లో పడిపోతుందని అనుకున్నప్పుడల్లా మళ్ళీ ఉవ్వెత్తున లేచే కెరటంలా రెపరెపలాడుతుంది. కెరీర్ మొదలెట్టినప్పుడు కాజల్ ఎంతగా సన్నగా నాజూగ్గా ఉందో.. ఇప్పుడు ఇన్నేళ్లకి కూడా కాజల్ అదే నాజూకు తనంతో కనబడుతుంది. తండ్రీ కొడుకులతో, బాబాయ్ అబ్బాయిలతో నటించడం అనేది కాజల్‌కే సాధ్యం అయ్యింది. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ తెలుగులో చిరు ఆచార్య సినిమాలోనూ, తమిళంలో కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తుండగా.. మరిన్ని అవకాశాలు కాజల్ తలుపు తట్టే అవకాశం ఉన్నట్లుగా సోషల్ మీడియా ప్రచారం. అయితే కాజల్ చాలా లేత వయసునుండే సంపాదన మొదలు పెట్టిందట. చిన్నప్పటినుండి పిల్లలు ఏమవ్వాలనే లక్ష్యం ఉంటుంది. దానికి ఓ స్పష్టత ఉంటుంది. అయితే ఫ్యూచర్‌లో వాళ్ళు అదే చేస్తారా.. లేదా.. అనేది తెలియదు. అలాగే నేను చిన్నప్పుడు ఒకలా అనుకునే దాన్ని.. కానీ తర్వాత చాలా గందరగోళానికి గురయ్యే దానిని.
అలాంటి పరిస్థితి నుండే నాకో ఆలోచన వచ్చింది. అసలు నేను ఎలాంటి పని చేస్తే నా మనసుకి తృప్తినిస్తుంది అని.. ముందు ఏదో ఒక పని చెయ్యాలని డిసైడ్ అయ్యాను. ముందుగా ప్రకటనలు అంటే యాడ్స్, ప్రజా సంబంధాలకు సంబందించిన ఓ కంపెనీలో చేరాను. అలా నేను 16 ఈయర్స్ నుండే సంపాదించడం నేర్చుకున్నాను. కాలేజ్‌కి వెళ్లిన వేసవి సెలవుల్లో ఏదో ఒక ఉద్యోగం వెతుక్కునేదాన్ని. నేను ఏ పనిని బాగా ఇష్టపడతానో తెలుసుకోవడానికే అలా ఉద్యోగాలు చేసేదాన్ని.. డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో లోరియల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో చేరాను. అందులో దాదాపుగా పది నెలలు పని చేశాను. ఇక ఎంబీఏలో ఉండగా సినిమాల్లో అవకాశాలు రావడం తర్వాత హీరోయిన్‌గా స్థిరపడడం జరిగింది అని చెబుతుంది కాజల్ అగర్వాల్. అంటే 16 ఏళ్లకే కాజల్ పనిలో ముందుందన్నమాట.