కమెడియన్ కమ్ హీరో సునీల్ టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కమెడియన్‌గా బాగా సక్సెస్ అయిన ఆయన హీరో అయిపోదామని వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు. హీరోగా నటించిన సినిమాల్లో కూడా ఒకటి అర మాత్రమే సక్సెస్ అయ్యాయి. అయితే కమెడియన్‌గానే కొనసాగుంటే ఈ పాటికి సునీల్ రేంజ్‌ను బహుశా ఎవరూ అందుకునేవారు కాదేమో..!. అలాంటిది ఈ కమెడియన్ చేజేతులారా చేసుకున్నాడు. వాస్తవానికి ఇప్పటికీ సునీల్ మనసులో ఇదే మెదులుతూనే ఉందని అనవసరం అటు నుంచి ఇటువైపుకు వచ్చి ఎటూ కాకుండా పోయానని సన్నిహితులతో చెప్పి వాపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట.
మరీ ముఖ్యంగా తన బెస్ట్ ఫ్రెండ్, అత్యంత ఆప్తుడు అయిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ మధ్య సునీల్‌ను పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో ‘బెస్ట్ ఫ్రెండే ఆయన్ను పట్టించుకోవట్లేదా..’, ‘సునీల్ కెరీర్ మలుపు తిరిగేదెప్పుడు’, ‘సునీల్‌ను మాటల మాంత్రికుడు మోసం చేశాడా..?’ అని కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లు పెద్ద ఎత్తున కథనాలు రాసేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో త్రివిక్రమ్ ఆలోచనలో పడ్డాడట. సునీల్‌ను ఎలాగైనా సరే మళ్లీ ఫేమ్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నాడట.
త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్‌తో మాటల మాంత్రికుడు సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తిగా పొలిటికల్‌గా ఉంటుందని కొందరు.. ఫ్యామిలీ కమ్ పొలిటికల్ అని ఇంకొందరు అంటున్నారు. అయితే.. ఈ సినిమాలో సునీల్‌కు మంచి పాత్ర ఇవ్వాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యాడట. వాస్తవానికి తనకు ఓ మంచి పాత్ర ఇచ్చి ఫేమ్‌లోకి తీసుకురావాలని ఆయన్ను సునీల్ తెగ అడుగుతున్నాడట. అందుకే మిత్రుడికి కెరీర్‌ను మలుపు తిప్పే పాత్ర ఇచ్చి ఫేమ్‌లోకి తీసుకొస్తాడని.. ఆయన కోసం ప్రత్యేకంగా మంచి పాత్ర తయారు చేశాడట త్రివిక్రమ్. ఆ పాత్ర సినిమాకు కీలకం అని తెలుస్తోంది. మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో..? ఇంతకీ అది కామెడీనా..? లేకుంటే సీరియస్‌గా ఉంటుందో తెలియాల్సి ఉంది.