Advertisementt

కింగ్ నాగ్‌కి కోపం తెప్పించిందెవరు?

Mon 27th Jul 2020 03:05 PM
king nagarjuna,ott platforms,angry,fire,wild dog,most eligible bachelor  కింగ్ నాగ్‌కి కోపం తెప్పించిందెవరు?
King Nagarjuna Angry on ott platforms కింగ్ నాగ్‌కి కోపం తెప్పించిందెవరు?
Advertisement
Ads by CJ

నాగార్జున ఏ విషయంలో అయినా చాలా ఖచ్చితంగా ఉంటాడు. సినిమాల విషయంలో అయినా.. బిజినెస్ వ్యవహారాలైనా, బిగ్ బాస్ హిట్స్ విషయంలో అయినా.. దేనికైనా సరే. అయితే నిన్నమొన్నటివరకు షూటింగ్స్‌ల విషయంలో ప్రభుత్వ అనుమతుల కోసం చిరు అండ్ బ్యాచ్‌తో తిరిగిన నాగార్జున ఇప్పుడు షూటింగ్స్ లేవ్ ఏం లేవ్ అంటున్నాడు. ఇక బిగ్ బాస్‌కి హోస్ట్‌గా చేయాలన్న నాగార్జున బిగ్ బాస్ యాజమాన్యానికి సవాలక్ష కండిషన్స్ పెట్టాడనే టాక్ ఉంది. అయితే తాజాగా నాగార్జున డిజిటల్ స్ట్రీమింగ్స్ ఓటిటి సంస్థలపై ఫైర్ అయ్యాడనే టాక్ నడుస్తుంది. కారణం వేరే చెప్పక్కర్లేదు. అది నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్, అఖిల్ తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. చిత్రాలే.

ఈ రెండు చిత్రాల కోసం ఓటీటీ వారు నాగార్జునని సంప్రదించారట. ఎలాగూ చాలా సినిమాలు ఇప్పుడు ఓటీటీ దారే పడుతున్నాయి. ఇప్పటికే కీర్తి సురేష్ పెంగ్విన్, భానుమతి అండ్ రామకృష్ణ, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలు ఓటీటీలో విడుదల కావడమే కాదు.. మరికొన్ని సినిమాలు ఇప్పుడు ఓటీటీ దారే పట్టబోతున్నాయి. అయితే ట్రెండ్‌ని ఫాలో అయ్యే నాగ్ కూడా తన సినిమాలేమన్నా ఓటీటీకి అమ్ముతాడేమో అని ఓటీటీ వారు నాగ్‌ని సంప్రదించారట. వైల్డ్ డాగ్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం. కానీ నాగార్జున మాత్రం తనని సంప్రదించిన ఓటీటీ వారిపై ఫైర్ అయ్యాడని తెలుస్తుంది. అసలే అఖిల్ మూడు ప్లాప్స్‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పుడు మూలిగే నక్కమీద తాటి టెంకలా అఖిల్ సినిమాని ఓటీటీకి అమ్మేస్తే అఖిల్ క్రేజ్ మరింతగా దిగజారుతోంది. అందుకే ఓటీటీ ప్రపోజల్ విషయమై నాగ్‌కి కోపమొచ్చిందట. 

King Nagarjuna Angry on ott platforms :

King Nag Reaction on OTT Offer to his and akhil Movies 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ