రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ నిన్నే(జూలై 25) రిలీజ్ అయ్యింది. ఎక్కడో కాదు తన సొంత వెబ్సైటు www.rgvworldtheatre.com ద్వారా రిలీజ్ చేసాడు. అయితే, అందరూ అనుకున్నట్టుగా సినిమాని పిచ్చిపిచ్చిగా తియ్యకుండా, కొంచెం తెలివితోనే తీశాడు అనిపించింది. అన్నిటికీ మించి సినిమాలో శ్రీ రెడ్డి లేదు. ఆశ్చర్యంగా ఉంది కదా.. నిజమే!
ఇంతకీ శ్రీ రెడ్డి లేకుండానే సినిమా తీశాడా లేక ఎడిటింగ్‌లో తీసేశాడా అన్నది అర్ధం కావట్లేదు. రామ్ గోపాల్ వర్మ స్వభావాన్ని బట్టి, శ్రీ రెడ్డిని తప్పకుండా ఈ సినిమాలో పెట్టాలి, కానీ లేదు. యాంటీ పవన్ ఫ్యాన్స్‌కి నచ్చని విషయం కదా? రామ్ గోపాల్ వర్మ భయపడి కూడా ఉండొచ్చు లేదా మార్కెటింగ్ జిమ్ముక్కు అయ్యి కూడా ఉండొచ్చు. కానీ ఈ సినిమా దెబ్బతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్‌జీవిని కూడా సపోర్ట్ చేస్తారేమో అనిపిస్తుంది.
రాము ఈ సినిమా క్లైమాక్స్‌లో తనే యాక్ట్ చేశాడు. అంతా ఇంతా కాదు, దాదాపు 10 నిమిషాల సింగిల్ సీన్‌లో ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రమే పవన్ కళ్యాణ్‌తో మాట్లాడతాడు. పవన్ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడడు. ఇదే సినిమాకి హైలెట్. సినిమా అంటే ఇది పెద్ద సినిమా కాదండోయ్. చాలా చిన్నది, కేవలం 36 నిమిషాలే. కేవలం 36 నిమిషాలకే సొంత ఆన్లైన్ థియేటర్ పెట్టి రూ. 250 వసూలు చేస్తున్నాడంటే, ఈ స్ట్రాటజీ రాముకే సొంతం. చూద్దాం. పవన్‌ని ఇలా వదిలేస్తాడో లేక సెకండ్ పార్ట్‌తో ఇబ్బంది పెడతాడో. ఏదేమైనా రాము నువ్వు తోపమ్మా.