ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Puri and Charmi Spotted cycling in Juhu

ముంబైలో ‘ఫైటర్’ కోసం పూరీ, చార్మి చక్కర్లు!

Puri and Charmi Spotted cycling in Juhu

ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ని కేంద్ర ప్రభుత్వం ఎత్తేసినా.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కరోనా ఉధృతి ఉన్న సిటీస్‌లో లాక్ డౌన్ పెట్టేసుకుంటున్నాయి. కేంద్రానికి సంబంధమే లేకుండా ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఇక సినిమా షూటింగ్స్ కి అనుమతి వచ్చిన కరోనా వలన షూటింగ్స్ చేయలేకపోతున్నారు. అంతలోపు ఆయా సినిమాల యూనిట్స్ హైదరాబాద్ లోనే సెట్స్ వేసుకుని సినిమా షూటింగ్స్ చేస్తారనే వదంతులు ప్రచారంలోకొచ్చాయి. ఇక పూరి జగన్నాధ్, ఛార్మీలు కూడా విజయ్ దేవరకొండ‌తో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ ముంబై‌లోని జుహు పరిసర ప్రాంతాల్లో చెయ్యడం కష్టం కాబట్టి హైదరాబాద్ లోనే ముంబై సెట్ ని దింపడానికి కరణ్ జోహార్ అనుమతి కోరినట్టుగా ఆ మధ్యన సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

అయితే తాజాగా పూరి అండ్ ఛార్మీలు ముంబై చేరుకొని జుహులో షూటింగ్ జరపడానికి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడడానికి మోడరన్ సైకిల్స్‌తో జుహు వీధుల్లో చక్కర్లు కొట్టారు. మరి జుహులో కరోనా లాక్ డౌన్ పెట్టడంతో షాప్స్ అన్ని మూత బడ్డాయి. దానితో వీధులన్నీ ఖాళీ. అయితే ఛార్మి, పూరి అంటే ముంబైలోని సాధారణ జనం అంతగా పట్టించుకోరు. అందుకే ఛార్మి, పూరి ఇద్దరూ ముంబైగా వీధుల్లో సైకిల్స్ వేసుకుని అక్కడ తాజా వాతావరణ షూటింగ్ కి సహకరిస్తుందో లేదో అనేది చూస్తున్నారు. మరి పూరి, ఛార్మి అలా సైకిల్స్ మీద చక్కర్లు కొడుతూ ముంబై పరిసరాల్ని పరిశీలించారంటే... విజయ్ దేవరకొండ సినిమాని ఖచ్చితంగా ముంబైలోనే తీస్తారు కానీ.. ఎలాంటి సెట్ వెయ్యరు అనేది అర్ధమవుతుంది. 

Puri and Charmi searching locations for Fighter

puri and charmi
puri jagannadh
charmi
fighter
location
mumbai
juhu