Advertisementt

ఇప్పట్లో ప్రేక్షకులు థియేటర్స్‌కి రారు.. ఫిక్స్!

Sun 26th Jul 2020 12:34 PM
tollywood stars,waiting,theaters opening,ott,corona,ram,anushka,vaishnav tej,v  ఇప్పట్లో ప్రేక్షకులు థియేటర్స్‌కి రారు.. ఫిక్స్!
Tollywood Stars Waiting for Theaters Opening ఇప్పట్లో ప్రేక్షకులు థియేటర్స్‌కి రారు.. ఫిక్స్!
Advertisement
Ads by CJ

మార్చి 20న మూతబడిన థియేటర్స్ ఇదిగో తెరుచుకుంటాయి.. అదిగో తెరుచుకుంటాయి అని అనుకోవడమే కానీ... ఆగష్టు లోను థియేటర్స్ తెరుస్తారంటే నమ్మలేకుండా ఉంది కరోనా ఉధృతి. కరోనా రోజురోజుకి జడలమర్రిలా పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. అయితే చాలా సినిమాలు కరోనా లేకపోతే ఏప్రిల్‌లో విడుదల కావాల్సినవి. కాని కరోనాతో రెడ్, వి, ఉప్పెన, నిశ్శబ్దం లాంటి సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉన్నాయి. కానీ థియేటర్స్ తెరిచే సూచనలు కనిపించడం లేదు. ఓటీటీ వారు ఉప్పెన, రెడ్, నిశ్శబ్దం, వి లాంటి క్రేజ్ ఉన్న సినిమాలకు మంచి ఆఫర్స్ ఇస్తున్నా.. హీరోలు నిర్మాతలను పడనియ్యడం లేదు. తమ క్రేజ్ తగ్గుతుంది అని.. ఎప్పటికైనా థియేటర్ లోనే మా సినిమా అంటూ మొండిగా కూర్చున్నారు.

ప్రస్తుతం కరోనా పరిస్థితిలో థియేటర్స్ తెరిచినా థియేటర్స్‌కి ప్రేక్షకులు రారు. ఇది ఫిక్స్. ఎందుకంటే కరోనా ఇప్పుడు మహమ్మారిలా మారింది. మార్చిలో ఉన్న కేసులకు పదింతలేమిటి ఇంకా భీభత్సంగా పెరిగిపోయాయి. అందుకే థియేటర్స్ తెరిచినా ప్రేక్షకులు రారు. అందుకే ఇప్పుడు వి, రెడ్, నిశ్శబ్దం, ఉప్పెన సినిమాలు అన్ని ఓటీటీ దారి పడితే మంచిది అనేలా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే సినిమాలకు క్రేజ్ పోయి.. థియేటర్స్ లో విడుదలైన చూసే నాధుడు ఉండదు. అదే ఇప్పుడైతే గనక ఓటిటిలో మంచి క్రేజ్ ఉంది. దాన్ని హీరోలంతా గుర్తించాలని ప్రేక్షకుల కూడా కోరుకుంటున్నాను. కానీ నాని, రామ్, అనుష్క, వైష్ణవ తేజ్ లాంటి వాళ్ళు మాత్రం దిగొచ్చేలా లేరు. ఇక కొద్దిగా షూటింగ్ మిగిలిన సినిమాలు క్రాక్, వకీల్ సాబ్, సోలో బ్రతుకే సో బెటరు సినిమాలు కూడా కరోనా తగ్గగానే షూటింగ్ ఫినిష్ చేసుకుని ఓటీటీ బాట పట్టినా ఆశ్చర్యం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. 

Tollywood Stars Waiting for Theaters Opening :

Audience Mindset on Cinema in Theater 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ