Advertisementt

షార్ట్ ఫిల్మ్‌కు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి!

Sun 26th Jul 2020 11:27 AM
manasa namaha,short film,international recognition,manasa namaha short film,international recognition  షార్ట్ ఫిల్మ్‌కు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి!
Manasa Namaha Short film gets international recognition షార్ట్ ఫిల్మ్‌కు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి!
Advertisement
Ads by CJ

పేరులోనే తెలియని తియ్యదనం నింపుకుని, మనసుకు హత్తుకునేలా తియ్యబడిన ‘మనసానమ:’ లఘు చిత్రం ఇటీవల యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యి అందరి దృష్టినే కాదు మనసును కూడా ఆకట్టుకుంది. కాలాలకనుగుణంగా మారే పరిస్థితులని, ఒక కుర్రాడు ప్రేమలో ఉన్నప్పుడు అనుభవించే భావోద్వేగాలకు ముడి పెడుతూ ఇప్పటితరం ప్రేమని, ప్రేమకథలను చక్కగా తెరకిక్కించడంలో దర్శకుడు దీపక్ విజయం సాధించాడు. తన చుట్టూ జరిగే కథలు, తను దగ్గరగా చూసిన మనుషులనుండి పుట్టుకొచ్చిన కథలను చక్కగా ఒకచోట చేర్చి సూర్య అనే పాత్రకు జోడించి చైత్రమాసం, వర్షాకాలం, శీతాకాలాలను తన జీవితంలో ఎదురయ్యే అమ్మాయిలతో ఎదురయ్యే పరిస్థితులకి ముడి పెడుతూ వాళ్ళ మధ్య జరిగే కథను అర్థవంతంగా, అద్భుతంగా చెప్పాడు దీపక్.

సూర్య పాత్రలో విరాజ్ అశ్విన్, చైత్రగా దృషిక ఇంకా శ్రీవల్లి, పృథ్వీ శర్మ, బన్నీ తదితరులు నటించిన ఈ లఘు చిత్రానికి కామ్రన్ సంగీతం, ఎదురోలు రాజు ఛాయాగ్రహణం అందించగా, శిల్ప గజ్జల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. చక్కటి కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పుతో పాటు ఎందరో సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. సంగీత దర్శకులు తమన్, నటీనటులు అనుష్క శెట్టి, రష్మీక మందన్న, సందీప్ కిషన్, అడవి శేష్.. దర్శకులు సుకుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి ఎందరో ప్రముఖులు ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ తమ తమ అభిప్రాయాలను ట్విట్టర్లో వ్యక్తపరిచారు.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ అయితే ఏకంగా ఒక అడుగు ముందు వేసి ‘మనసానమ:’ను తమిళంలో డబ్ చేసి, సమర్పించి తన నిర్మాణ సంస్ధ ఒండ్రాగా ఎంటర్టైన్మెంట్ ద్వారా విడుదల చేసారు. సినిమాలే తమిళంలో డబ్ అవ్వడం అరుదు.. ఒక లఘు చిత్రం అవ్వడం గొప్ప విశేషం అనే చెప్పాలి, అది కూడా గౌతమ్ మీనన్ లాంటి గొప్ప దర్శకుడితో. ‘‘నాకు చాలా నచ్చిన సినిమా, అందరికి తప్పక చూపించాలి అనే ఉద్దేశంతో చేశాను, దీపక్ యాటిట్యూడ్ అండ్ స్టైల్ చాలా నచ్చాయి’’ అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు మీనన్. అంతేనా అన్నట్టుగా ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. 90 పైగా అవార్డులను వివిధ విభాగాలలో దక్కించుకున్న ‘మనసానమ:’ ఇటీవలి కాలంలో మెచ్చుకోదగిన స్థాయిలో ఉంది. ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆన్లైన్ ఫిలిం ఫెస్టివల్ ఐన ‘టాప్ షార్ట్స్’లో ఉత్తమ రొమాన్స్ లఘు చిత్రం, హాలీవుడ్‌కి చెందిన ‘ఇండిపెండెంట్ షార్ట్స్ అవార్డ్స్’, ‘ఇండీ షార్ట్ ఫస్ట్’, ‘ఇండీస్’, ఫ్లోరిడాకి చెందిన ‘మియామీ ఇండిపెండెంట్ ఫెస్టివల్’ డిట్రాయిట్‌లోని ‘ట్రినిటీ ఇంటర్నేషనల్’, స్కాట్లాండ్‌లోని ‘ఫీల్ ది రీల్’, ఇంకా యు.కె, ఆస్ట్రేలియా.. టాప్ 100 ఫెస్టివల్స్‌లో అవార్డ్స్ సొంతం చేసుకుంది.

ఈ అవార్డుల్లో ముఖ్యంగా ISFMF( ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ మ్యూజిక్ ఫిలిం ఫెస్టివల్)లో ప్రపంచవ్యాప్తంగా 15 లఘుచిత్రాలు మాత్రమే చోటు దక్కించుకుంటే అందులో ‘మనసానమ:’ చేరటం విశేషం. ISFMF ఈవెంట్ ఈ ఏడాది పులా ఆంఫి థియేటర్లో జరగనుంది. ఆస్కార్ మరియు బాఫ్తా అవార్డు గ్రహీతలు ఎడ్డీ జోసెఫ్, గ్యారీ మార్లౌ, స్టీఫెన్ మార్బెక్, జాన్ వొట్మాన్ తదితరులు ఈ ఫెస్టివల్ కి బోర్డు మరియు జ్యూరీ మెంబెర్స్. ISFSM పోయిన సంవత్సరంలో ఎంపికై, గెలిచిన సినిమాలు, కపెర్నమ్, స్పీల్బర్గ్ తీసిన ‘రెడీ ప్లేయర్ వన్’, హెరిడిటరీ, అన్నిహలేషన్ తదితర గొప్ప హాలీవుడ్ సినిమాలు. ఇలాంటి ఒక ఫెస్టివల్‌లో ‘మనసానమ:’ ఎంపికవ్వడం చాలా పెద్ద విశేషం! పూల ఆంఫీ థియేటర్ రోమన్ కాలం నాటి అతి పెద్ద కట్టడం, దానిలో ఈ ఈవెంట్ జరగడం చెప్పాలంటే తెలుగు సినిమా అక్కడ ఎంపికవ్వడం ఒక పెద్ద లైఫ్ టైం అచీవ్మెంట్.

Manasa Namaha Short film gets international recognition:

Manasa Namaha Short film Creates sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ