Advertisementt

‘ఒరేయ్‌ బుజ్జిగా..’ పాట‌లు విడుద‌ల‌!

Sun 26th Jul 2020 11:02 AM
orey bujjiga movie,jukebox,songs released,raj tarun  ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ పాట‌లు విడుద‌ల‌!
Orey Bujjiga Movie Songs released ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ పాట‌లు విడుద‌ల‌!
Advertisement
Ads by CJ

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న చిత్రం  ‘ఒరేయ్‌ బుజ్జిగా...’. ఇప్పటికే విడుదలైన టీజర్ అంచ‌నాల‌ను పెంచిన విష‌యం తెలిసిందే..యూత్‌ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలోని పాట‌లు ఈ మూవీకి మ‌రింత క్రేజ్‌ను సంపాదించిపెట్టాయి. ఈ చిత్రంలోని ఒక్కో పాట‌ను విడుద‌ల చేస్తూ హైప్ తీసుకువ‌చ్చిన చిత్ర యూనిట్ శనివారం జ్యూక్ బాక్స్ ద్వారా అన్ని పాట‌ల‌ను విడుద‌ల‌చేసింది. అనూప్ రూబెన్స్ స్వ‌ర ప‌రిచిన అన్ని పాట‌లు సంగీతాభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. 

ముఖ్యంగా.. ఈ మాయ పేరేమిటో.. ఏమిటో.. అంటూ హుషారుగా సాగే ఈ పాట‌ని లేటెస్ట్ సింగింగ్ సెన్సేష‌న్ సిద్ శ్రీ‌రామ్ పాడారు. ఈ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ పాటకు కిట్టు విస్సా ప్ర‌గడ సాహిత్యం అందించారు. కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన.. అంటూ కె.కె రాసిన ఈ పాట‌ను అర్మాన్‌ మాలిక్‌, పి.మేఘన అద్భుతంగా ఆలపించి వీనుల విందు కలిగించారు. కృష్ణ‌వేణి ..కృష్ణ‌వేణి  అంటూ రాహుల్ సిప్లిగంజ్ త‌న‌దైన శైలిలో పాడిన ఈ పాట‌ను కాస‌ర్ల శ్యామ్ రాశారు. స‌రిగ‌మ‌గ‌మ‌ గామ హంగామ చేద్దామా.. ప‌ద‌నిస‌నిస నీస్సా నీ నీషా..నీద‌మ్మా.. అంటూ హుషారుగా సాగే ఈ పాట‌లో రాజ్‌తరుణ్ ఎన‌ర్జిటిక్ స్టెప్పులు, హెబా ప‌టేల్ అందాలు యూత్‌ని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట‌కు వ‌న‌మాలి సాహిత్యం అందించ‌గా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్‌ రూబెన్స్ గానం చేశారు. క‌ల‌లు చూసినా క‌న్నులే నేడు మోసెనే క‌న్నీల్లే... హాయి పంచినా గుండెకే ఓ గాయ‌మ‌య్యెనే..అంటూ అర్ద‌వంతంగా మ‌న‌సుకు హ‌త్తుకునే ఈ విర‌హ‌గీతాన్ని కాస‌ర్ల శ్యామ్ రాయ‌గా లేటెస్ట్ సింగింగ్ సెన్సేష‌న్ సిద్ శ్రీ‌రామ్ అంతే అద్భుతంగా ఆల‌పించారు. ఈ సినిమాలోని పాట‌లు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుల‌య్యాయి.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Orey Bujjiga Movie Songs released :

Orey Bujjiga Movie Jukebox Released 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ