Advertisementt

వర్మపై సెటైరికల్‌గా ‘ఆర్జీవీ 0.5’ చిత్రం!

Sat 25th Jul 2020 06:50 PM
rgv 0 point 5,rgv,ram gopal varma,satirical film,varma  వర్మపై సెటైరికల్‌గా ‘ఆర్జీవీ 0.5’ చిత్రం!
Satirical Film on varma titled RGV 0 point 5 వర్మపై సెటైరికల్‌గా ‘ఆర్జీవీ 0.5’ చిత్రం!
Advertisement
Ads by CJ

బ్యానర్ బాయ్ మీడియా బ్యానర్‌లో తెలుగు మరియు హిందీ భాషలలో ఫిక్షన్ కామెడీ జోనర్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఆర్జీవీ 0.5’. దీనికి నిర్మాత రాహుల్ పండిట్. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. ‘‘ఏ మనిషికైనా మ్యాటర్ వీక్ అయినప్పుడు... పబ్లిసిటీ పిక్‌లో చేస్తాడు. అలా మ్యాటర్ వీక్ అయ్యి ముంబై నుండి హైదరాబాద్ వచ్చి ఏం చేశాడు ఎలా చేశాడు అనేది కథ. ఎవరికీ తెలియని నిజాలను ఫిక్షన్ రూపంలో  మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నమే ఈ సినిమా. అంతేకాదు ఈ సినిమాలో హైలెట్స్ ఏంటంటే హీరో జామ్ గోపాల్ వర్మ ఇంట్రడక్షన్ హైలెట్.... అలా ఇంట్రడక్షన్ నుంచి హైలెట్‌గా సాగుతూ ఎండింగ్ వరకు హైలెట్‌గానే ఉంటుంది.

 

ఇందులో హీరో పాత్ర కాకుండా యాంకర్ గజిని మియా పాలకోవా హీరోకి ఎప్పుడు వెన్నంటే ఉండే - పుంజు - అనే క్యారెక్టర్ ఇంకా చాలా క్యారెక్టర్స్ అన్నీ వన్ బై వన్ రిలీజ్ చేస్తాం. అంతేకాదు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎనిమిది మంది దర్శకులు ఈ సినిమాకు డైరెక్షన్ చేయడం జరుగుతోంది. ఇది ఎవరినీ ఉద్దేశించి తీసిన సినిమా కాదు. రామ్ గోపాల్ వర్మని ఉద్దేశించి అస్సలు తీయలేదు దయచేసి గమనించగలరు..’’ అని తెలిపారు. 

Satirical Film on varma titled RGV 0 point 5 :

RGV 0 point 5 Movie Details 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ