టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. తాజ్ ఫలక్ నుమా ప్యాలస్ లో రేపు వివాహా వేడుక జరగనుంది. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరు కానున్నారని సమాచారం. అయితే నితిన్ పెళ్ళి కానుకగా రంగ దే టీమ్ గిఫ్ట్ ని రెడీ చేసిందని టాక్ వినబడుతుంది. నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన రంగ్ దే చిత్రం నుండి టీజర్ రాబోతుందని సమాచారం.
రేపు సాయంత్రం 4:05గంటలకి రంగ్ దే టీజర్ రిలీజ్ చేస్తారట. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లవ్ డ్రామా సగభాగం చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అన్నీ కుదురుకున్నాక మిగతా భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు.