గత కొన్ని రోజులుగా నెపోటిజంపై బాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ విషయమై స్టార్ కిడ్స్ పై విమర్శలు వెల్లువెతున్నాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చేవారిపై వివక్ష చూపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అవకాశాలు రాకుండా చేయడం అనేది చిన్న చిన్న నటుల వరకే పరిమితం కాలేదట. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారని తెలుస్తుంది.
తాజాగా ఏ ఆర్ రెహమాన్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. బాలీవుడ్ లో తనకి అవకాశాలు రాకుండా చేస్తున్నారనీ, తనకి వర్క్ ఇస్తే చాలా ఆలస్యం చేస్తాడని, దానివల్ల రిలీజ్ ఆలస్యం అవుతుందని ఇతరులకి హెచ్చరికలు జారీచేస్తూ రెహమాన్ వద్దకి రానీకుండా అడ్డుకుంటున్నారట. ఇలాంటి హెచ్చరికలు సుశాంత్ చివరి చిత్రం దిల్ బేచరా డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రాకి కూడా వచ్చాయట.
దిల్ బేచరా చిత్రానికి రెహమాన్ సంగీతం అందించాడు. ఆ మ్యూజిక్ కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. మరి రెహమాన్ లాంటి వాళ్లే ఇబ్బందులు పడుతుంటే స్ట్రగ్లింగ్ లో ఉన్నవారు ఇంకెన్ని ఇబ్బదులు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో ఏళ్ళుగా బాలీవుడ్ లోనే స్థిరపడ్డవాళ్ళు సైతం ఇలాంటి ఇబ్బందులని ఎదుర్కొంటున్నారంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.