బాహుబలి తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటడానికి చాలా సినిమాలు ప్రయత్నించాయి. అయితే వాటన్నింటిలో కేజీఎఫ్ ఒక్కటే దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టించింది. కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిజాన్ని పీక్స్ లో చూపించారు. ముఖ్యంగా హీరో తాలూకు ఎలివేషన్ సీన్స్ తో గూస్ బంప్స్ తెప్పించారు.
అయితే ప్రస్తుతం కేజీఎఫ్ రెండవ చాప్టర్ కూడా రెడీ అవుతోంది. మొదటి అధ్యాయంతో అంచనాలు పెంచేసిన చిత్రబృందం రెండ అధ్యాయం కోసం ఎదురుచూసేలా చేసారు. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఈ సినిమాలో అధీరా పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించనున్నాడని తెలిసిందే. ఇప్పటికే సంజయ్ దత్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేసారు. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్ నుండి మరో అప్డేట్ రానుందట.
ఈ నెల 29వ తేదీన సంజయ్ దత్ పుట్టినరోజుని పురస్కరించుకుని కేజీఎఫ్ టీమ్ ఒక నిమిషం నిడివి గల వీడియోని రిలీజ్ చేయనున్నారట. ఈ వీడియోలో అధీరాగా సంజయ్ దత్ కనిపించబోతున్నాడట. పవర్ ఫుల్ గా కనిపించనున్న ఈ వీడియో కోసం కేజీఎఫ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.