ఆకట్టుకుంటోన్న నాగశౌర్య న్యూ మూవీ ప్రీ లుక్!

Sat 25th Jul 2020 06:27 PM
naga shaurya,pre look,ns10 film,magnificent pre look  ఆకట్టుకుంటోన్న నాగశౌర్య న్యూ మూవీ ప్రీ లుక్!
Naga Shourya New Movie Pre Look Released ఆకట్టుకుంటోన్న నాగశౌర్య న్యూ మూవీ ప్రీ లుక్!

నాగశౌర్య కొత్త చిత్రం ప్రీలుక్‌కి విశేష స్పందన... జూలై 27న ఫస్ట్ లుక్ విడుదల

యువ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలుగా శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న చిత్రం ప్రీలుక్‌ను విడుదల చేశారు. సూపర్ ఫిట్‌గా వెనుకనుండి కనిపిస్తున్న నాగశౌర్య  ప్రీలుక్ విశేష స్పందన రాబట్టి ఫస్ట్ లుక్ మీద అంచనాలు పెంచింది. 

 

ప్రతి సినిమాలో తన స్పెషాలిటీ‌ని నిరూపించుకుంటూ ఛలో, ఓ బేబీ, అశ్వద్ధామ వంటి హిట్స్‌తో దూసుకెళ్తున్న యంగ్ హీరో నాగశౌర్య కొత్త సినిమా #NS20 ఫస్ట్ లుక్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల జూలై 27న ఉదయం 9 గం లకు విడుదల చేయనున్నారు. ఆసక్తికరమైన ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది.

Naga Shourya New Movie Pre Look Released:

Magnificent Pre look Of Naga Shaurya Next Is Out.. First Look On 27th July