Advertisementt

బిగ్ బాస్ 4 లో ఫేమస్ ఫోక్ సింగర్..?

Sat 25th Jul 2020 01:26 AM
mangli,biggbosstelugu4,telugu,satyavathi rathode  బిగ్ బాస్ 4 లో ఫేమస్ ఫోక్ సింగర్..?
Famous Folk singer into BiggBoss Season 4..? బిగ్ బాస్ 4 లో ఫేమస్ ఫోక్ సింగర్..?
Advertisement
Ads by CJ

గత మూడు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్, నాలుగవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు స్టార్ మా టీజర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ స్టార్ట్ కాబోతుందని తెలిసినప్పటి నుండి అందులో వచ్చే కంటెస్టెంట్లు ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి.

టాలీవుడ్ పాపులర్ హీరోయిన్లు.. శ్రద్ధా దాస్, హంసా నందినీ, యామినీ భాస్కర్, డాన్స్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ కంటెస్టెంట్లుగా రాబోతున్నారని  వినిపించింది. తాజాగా హౌస్ లోకి ఫోక్ సింగర్ రాబోతుందని ప్రచారం జరుగుతోంది. జానపద గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న మంగ్లీ బిగ్ బాస్ సీజన్ 4 లోకి రాబోతుందట. ఈ మేరకు బిగ్ బాస్ టీమ్ ఆమెని సంప్రదించిందని టాక్. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడి. మంగ్లీగా పరిచయమై యూట్యూబ్ లో ఎన్నో పాటల్లో కనిపించింది.

ఆమె ఖాతాలో చాలా మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావం గురించిన పాటకానీ, ఇంకా తెలంగాణ పండగల గురించిన పాటలు చాలానే పాడింది. అంతేకాదు సినిమా పాటలకి కూడా ఆమె గొంతు విప్పింది. అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాములా పాటని ఆలపించింది మంగ్లీనే. మరి ప్రచారం జరుగుతున్నట్టుగా హౌస్ లోకి మంగ్లీ వస్తుందో లేదో తెలియాలంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకూ వేచి చూడాల్సిందే.

Famous Folk singer into BiggBoss Season 4..?:

Famous Folk singer into BiggBoss Season 4..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ