శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ నటించిన గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్ సినిమా థియేటర్స్ బంద్ కారణంగా ఓటిటిలో విడుదల కాబోతుంది. నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కాబోతున్న గుంజన్ సక్సేనా ప్రమోషన్స్‌లో పాల్గొన్న జాన్వీకపూర్ తానూ సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చాను కాబట్టే తనకి అవకాశాలు దక్కుతున్నాయని, అలాగే ఇండస్ట్రీలో తనకి గౌరవం దక్కింది అని చెబుతుంది. బాలీవుడ్‌లో మహిళా నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమీ తనకి ఎదురు కాలేదని.. ఎందుకంటే నేను సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయిని కాబట్టి.. అందుకే నేను చాలా అదృష్టవంతురాలిని అని చెబుతుంది జాన్వీకపూర్.
ఇక సినిమాల్లో హీరో హీరోయిన్స్‌కి ఉన్న తేడా గురించి మాట్లాడుతూ.. దర్శకులు కథ చెప్పేటప్పుడు కొన్ని కొన్నిసార్లు హీరోలపైనే దృష్టి పెడతారు. అయితే సినిమాల్లో హీరో పాత్రలే చాలా కీలకం కాబట్టి దర్శకులు కూడా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనుకునే దాన్ని. కానీ అది వారికీ తెలియకుండానే ఓ అలవాటుగా మారిపోయింది అని చెబుతుంది జాన్వీకపూర్. మరి హీరోయిజం ఎందుకు హైలెట్ చేస్తున్నారో అనేది తనకి తర్వాత కానీ తెలిసిరాలేదని అంటుంది జాన్వీ. అంటే జాన్వీకపూర్ దృష్టిలో బాలీవుడ్‌లోనూ పురుషాధిక్యం, అలాగే బ్యాగ్రౌండ్ లేనిదే... ఎదగలేరనేది స్పష్టం అవుతుంది.