Advertisementt

సమంత.. టాలీవుడ్‌కి ఓకే చెబుతుందా?

Sat 25th Jul 2020 06:03 PM
samantha,web series,tollywood,bollywood,tollywood directors  సమంత.. టాలీవుడ్‌కి ఓకే చెబుతుందా?
Tollywood directors waiting for Samantha to web series సమంత.. టాలీవుడ్‌కి ఓకే చెబుతుందా?
Advertisement
Ads by CJ

కరోనాతో ఇప్పుడు సినిమాల షూటింగ్‌ల విషయమై ఏం చేయాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే చాలామంది హీరోయిన్స్ ఫ్యూచర్‌లో హైలెట్ కాబోయే వెబ్ సీరీస్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సమంత ఏకంగా బాలీవుడ్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్‌లో ఎప్పుడో నటించేసింది. ఇక తాజాగా త్రిష, కాజల్, తమన్నా, రకుల్ లు కూడా వెబ్ సీరీస్‌ల వెంట పడుతున్నారనే టాక్ ఉంది. ఇక కరోనా కన్నా ముందే సమంత సినిమాలు తగ్గించేసి బాలీవుడ్ వెబ్ సీరీస్ కోసం నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్‌కి జై కొట్టింది. కాజల్, తమన్నాలు తెలుగులో, తమిళంలో తెరకెక్కబోయే వెబ్ సీరీస్‌లలో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు సుకుమార్, వంశి పైడిపల్లి, మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్స్ వెబ్ సీరీస్ లకి స్క్రిప్ట్ లు రెడీ చేస్తున్నారు.

ఇక పూరి దగ్గర కూడా ఓటిటి కంటెంట్ రెడీ అవుతుంది అని ఛార్మి చెబుతుంది. అయితే సమంత కేవలం ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్ లోనే నటించింది కానీ.. తెలుగులో ఏ వెబ్ సీరీస్ కోసం రెడీ కావడం లేదు. సుకుమార్, పూరి, సందీప్ వంగా లాంటి వాళ్ళు వెబ్ సీరీస్ కోసం కంటెంట్ తయారు చేస్తున్నారు. అందులో కొంతమంది బాలీవుడ్‌లో వెబ్ సీరీస్ కోసం పనిచేసిన సమంతని సంప్రదించే ఆలోచనలో ఉన్నారట. అయితే సమంతని బాలీవుడ్ వెబ్ సీరీస్ కోసం తీసుకున్నది సౌత్‌లో ఆ వెబ్ సీరీస్ కి క్రేజ్ వస్తుందని.. భారీ పారితోషకం ఆఫర్ చేసి మరీ తీసుకున్నారు. ఎలాగూ సినిమాలు ఒప్పుకోలేదు.. కాబట్టి వెబ్ సీరీస్ కోసం సమంత ఒప్పుకుంటుంది అని అనుకుంటున్నారట. మరి సమంత కేవలం బాలీవుడ్ వెబ్ సీరీస్‌లే చేస్తుందో.. లేదా టాలీవుడో వెబ్ సీరీస్‌లలోనూ నటిస్తుందో చూడాలి.

Tollywood directors waiting for Samantha to web series:

Samantha did web series in Bollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ