Advertisementt

‘ఎల్లిపోతావురా మనిషి’ అంటున్న స్వాతి రెడ్డి!

Sat 25th Jul 2020 05:36 PM
singer swathi reddy,song,viral,social media,ellipothavura manishi song  ‘ఎల్లిపోతావురా మనిషి’ అంటున్న స్వాతి రెడ్డి!
Singer Swathi reddy song viral in social media ‘ఎల్లిపోతావురా మనిషి’ అంటున్న స్వాతి రెడ్డి!
Advertisement
Ads by CJ

 

‘ఎల్లిపోతావురా మనిషి’ అంటూ అందమైన పాటతో స్వాతి రెడ్డి 

సప్త సముద్రాలూ దాటి పర దేశ సంప్రదాయాలతో బ్రతుకుతున్న మన భారతదేశ సంప్రదాయాలు ఎప్పటికి మర్చిపోలేదు గాయని స్వాతి రెడ్డి. ప్రతిరోజూ ఆంగ్లంలో మాట్లాడుతున్నా మన తెలుగు భాషను ఎన్నడూ మర్చిపోలేదు గాయని స్వాతి రెడ్డి. ఎన్నో అద్భుతమైన తెలుగు బాణీలతో స్పష్టమైన తెలుగు మాటలతో మన తెలుగు వాళ్ళని ఎపుడు అలరిస్తూనే ఉంది గాయని స్వాతి రెడ్డి. ఇప్పుడు మరొక అద్భుతమైన పాటతో వచ్చింది. 

ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓ నాడు ఈ భూమి వదిలేసి..... ఉండాలి రా కలిసిమెలిసి అర్రే ఉన్నన్నాళ్లు కొత్త తెలిసి.. అంటూ మనసుకు హత్తుకునే పాటతో వచ్చింది. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మన భారతమాత తన బిడ్దలను కాచి కాపాడుతుంది. అలానే మనిషి పుట్టుక పుట్టిన మనం కష్ట కాలం అయినా కలిసి మెలిసి ఉండాలి అనే చెప్పే గొప్ప పాట ఇది. మానవత్వం మరిచి మనస్సాక్షిని విడిచి స్వార్ధం, ధ్వేషంతో బ్రతుకుతున్న మనుషుల గురించి చెప్తూ, ఈ జీవం కొన్నాళ్లే, ఉన్నన్నాళ్ళు అందరితో కలిసి ఉండమని జీవిత పరమార్థం తెలియజేస్తున్న పాట. ఇది పాట కాదు మేము మనుషులం అని ముసుగు వేసుకుని నటిస్తున్న మన అందరి ఆట.

 

ఈ పాటకి భీమ్స్ సిసిరోలియో సంగీతం, సాహిత్యం అందించగా.. లండన్‌లో ఉంటున్న స్వాతి రెడ్డి గానం చేసారు. ఈ పాట చిత్రీకరణ అంతా లండన్‌లోనే జరిగింది. నాగోల్ బాల్ రెడ్డి మరియు లొంక నరేందర్ రెడ్డి ఈ పాటను నిర్మించారు. ఈ పాటని మన తెలుగు వారందరికీ అంకితం ఇస్తున్నారు. 

లిరిక్స్ అండ్ మ్యూజిక్ - భీమ్స్ సిసిరోలియో

సింగర్ - స్వాతి రెడ్డి 

ఆలప్ - ఫైజాన్ ఖాన్ 

ఎడిటర్ - శివ వై ప్రసాద్ 

కెమెరా - ఏం వి ప్రసాద్ 

నిర్మాత - నాగోల్ బాల్ రెడ్డి మరియు లొంక నరేందర్ రెడ్డి

మ్యూజిక్ కోఆర్డీనేటర్ - మాల్యా కందుకూరి 

మిక్సింగ్ - ఎస్. కిశోర్  కుమార్ 

మస్టర్డ్ - ఆర్టిఫ్లెక్ స్టూడియో సిడ్నీ

Singer Swathi reddy song viral in social media:

Singer Swathi reddy Latest song released 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ