రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు అందులో రాజమౌళి RRR షూటింగ్ చాలావరకు కానిచ్చేశాడు, మరొకటి చిరు - కొరటాల ఆచార్యలో అతిధి పాత్ర చేయబోతున్నాడు. ఇప్పుడు ఏ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కి కోత పెట్టారనుకుంటున్నారా.. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ని గెస్ట్ రోల్ లో నటింపజేస్తే.. సినిమాకి భీభత్సమైన క్రేజ్ వస్తుంది అని కొరటాల శివ భావించాడు. కానీ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో కేవలం గెస్ట్ రోల్‌కే పరిమితం చేయడం ఇష్టం లేని కొరటాల శివ, రామ్ చరణ్ పాత్రని ఆచార్యలో 30 నిమిషాల పాటు పెంచేసాడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కి పెద్ద చిక్కొచ్చిపడింది. కరోనా మహమ్మారి రామ్ చరణ్ ప్లాన్స్‌ని పాడు చేసేసింది.
RRR, ఆచార్య రెండూ కరోనా కారణంగా ఆగిపోయాయి. అయితే RRR షూటింగ్ అవ్వకుండా ఆచార్యకి వెళ్లలేడు. రామ్ చరణ్ వచ్చేవరకు ఆచార్య ఆపలేరు. అలాగే RRR షూటింగ్, గ్రాఫిక్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని కలిపి పూర్తయ్యేసరికి విడుదల వచ్చే ఏడాది సమ్మర్ అవ్వొచ్చు. అయితే ఈలోపు ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు ప్లాన్ చెయ్యొచ్చు. అయితే రాజమౌళి RRR కన్నా ముందు రామ్ చరణ్ ని చూపిస్తే ఊరుకునేలా లేడు. అందుకే కొరటాలకి ఏం చేయాలో పాలుపోక రామ్ చరణ్ పాత్రని ఆచార్యలో కుదిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ముప్పై నిమిషాల పాత్రని కేవలం 5 నుండి 10 నిమిషాలకే కుదిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్.