నేషనల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. సాహో తర్వాత రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాధేశ్యామ్ ఒకటి కాగా, మహానటి దర్శకుడు దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఒప్పుకున్న సినిమా మరొకటి. అయితే ఈ రెండు సినిమాల నుండి లేటెస్ట్ గా రెండు అప్డేట్లు బయటకి వచ్చాయి. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ తో మురిపించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకునేని అనౌన్స్ చేసారు.
అయితే ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందట. దర్శకుడు చెప్పినట్టు ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందుతుంది. ఈ సినిమాలో మూడవ ప్రపంచ యుద్ధం గురించి ఉండనుందని అంటున్నారు. కల్పిత కథగా తెరకెక్కుతోన్న నాగ్ అశ్విన్ మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులని చూపించనున్నాడట. అయితే ఇందులో ప్రభాస్, సూపర్ హీరోగా కనిపించనున్నాడట. దేవకన్య కొడుగ్గా ప్రభాస్ కనిపిస్తాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు ఎవరనేది ప్రకటించలేదు.