Advertisementt

బన్నీ, కొరటాల సినిమాకు టైటిల్ ఫిక్సయిందా?

Thu 23rd Jul 2020 07:13 PM
allu arjun,kaaranajanmudu,koratala siva,title,bunny  బన్నీ, కొరటాల సినిమాకు టైటిల్ ఫిక్సయిందా?
Allu Arjun and Koratala Siva Combo Film title బన్నీ, కొరటాల సినిమాకు టైటిల్ ఫిక్సయిందా?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ఒక సినిమా సెట్స్ మీదున్నప్పుడే మరో సినిమాని లైన్ లో పెట్టుకుంటాడు. నా పేరు సూర్య దెబ్బకి త్రివిక్రమ్‌తో సినిమా చెయ్యడానికి ఏడాది గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత ఐకాన్ ని వేణు శ్రీరామ్ తో అనుకుంటే కాదు సుకుమార్ తో పుష్ప అంటూ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అయితే కరోనా టైం లో పుష్ప సినిమా పట్టాలెక్కడానికి బాగా టైమ్ పట్టేలా ఉండడం.. మరోపక్క మెగా కాంపౌండ్ లోనే రెండేళ్లుగా ఉన్న కొరటాల శివ చిరు కోసం ఆచార్య షూటింగ్ చేస్తున్నప్పుడు కరోనా లాక్‌డౌన్ రావడంతో.. ఓ కథ తయారు చేసి అల్లు అర్జున్ తో నెక్స్ట్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడనే టాక్ ఉంది.

కొరటాల - అల్లు అర్జున్ కాంబో పక్కా అని.. అల్లు అర్జున్ పుష్ప తర్వాత ఐకాన్ చెయ్యకపోవచ్చని, ఇక కొరటాల శివ ఆచార్య తర్వాత అల్లు అర్జున్ తోనే సినిమా ని.. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యి.. చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టుగా టాక్. ఇక అల్లు అర్జున్ - కొరటాల కాంబోలో తెరకెక్కబోయే సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ టైటిల్ ప్రచారం లోకొచ్చింది. అదే కారణజన్ముడు అంటున్నారు. అల్లు అర్జున్ కారణజన్ముడిగా కొరటాల ఫార్మేట్ సామజిక అంశాలతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టుగా టాక్. త్వరలోనే కొరటాల శివ - అల్లు అర్జున్ కాంబో కారణజన్ముడు అధికారిక ప్రకటన వస్తుంది అని ఫిల్మ్నగర్ టాక్.

Allu Arjun and Koratala Siva Combo Film title:

Allu Arjun Is Kaaranajanmudu!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ