పాన్ ఇండియా స్టార్స్ మొత్తం బాలీవుడ్ భామలనే పడుతుంటే.. అల్లు అర్జున్ మాత్రం సౌత్ హీరోయిన్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. సౌత్ హీరోలెవరైనా పాన్ ఇండియా మూవీ మొదలు పెడితే.. ఖచ్చితంగా ఆ సినిమాకి బాలీవుడ్ భామ రావాల్సిందే. బాహుబలి టైం రాజమౌళి అంత ఎక్కువగా ఆలోచించలేదు కానీ.. ప్రభాస్ సాహో టైం లో బాలీవుడ్ భామ అయితే క్రేజ్ వస్తుంది ఆని శ్రద్దా కపూర్ ని తీసుకున్నాడు. సాహో సినిమాకి శ్రద్దా కపూర్ పెద్ద యూజ్ అయ్యింది లేదు. అందుకే రాధేశ్యామ్ వచ్చేసరికి ప్రభాస్ హిందీలోనూ పరిచయమున్న పూజా హెగ్డేతో సరిపెట్టుకున్నాడు. ఇంకా ఆ సినిమా విడుదలకావాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించబోయే RRR లో రామ్ చరణ్ కి జోడిగా రాజమౌళి బాలీవుడ్ భామ అలియా భట్‌ని తీసుకున్నాడు. ఎన్టీఆర్‌కి ఏకంగా హాలీవుడ్ హీరోయిన్‌ని దింపుతున్నాడు.
మరి తాజాగా ప్రభాస్ - నాగ్ అశ్విన్ పాన్ ఇండియా ఫిలిం కోసం ఏకంగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనేని తీసుకొస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఆలోచనలు పాన్ ఇండియా లెవల్లో ఉన్నా హీరోయిన్ విషయంలో సౌత్‌కే పరిమితం చేసాడు. సుకుమార్‌తో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న అల్లు అర్జున్ బాలీవుడ్ భామని తీసుకుంటాడనుకుంటే.. కేవలం సౌత్ హీరోయిన్ రష్మికతోనే ఆగిపోయాడు. అందులోను రష్మికకి పెరఫార్మెన్స్ తక్కువ.. ఓవరాక్షన్ ఎక్కువ అన్నట్లుగా టాక్ నడుస్తుంది. అలాంటి హీరోయిన్‌తో అల్లు అర్జున్ ఏ ధైర్యంతో పాన్ ఇండియాకి వెళుతున్నాడు. ఏ కియారానో, లేదంటే మరేదన్న బాలీవుడ్ భామనో తీసుకోవాలి కానీ.. అల్లు అర్జున్ ఇలా హీరోయిన్ విషయంలో కాంప్రమైజ్ ఎలా అయ్యాడో అర్ధం కాక అల్లు అర్జున్ ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇక ఆఖరుకి విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్ భామ అనన్య పాండే తో సినిమా చేస్తున్నాడు. అలాంటిది అల్లు అర్జున్ ఎందుకిలా అంటూ ఫ్యాన్స్ ఫీలైపోతున్నారు.