టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటూ కనిపిస్తున్నాడు. ఇప్పటి తరానికి తగినట్లుగా కథల్ని తెరకెక్కిస్తూ నిర్మాణ సంస్థని టాప్ లో ఉంచుతున్నాడు. అదీగాక రానా దగ్గుబాటి సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవడంతో సురేష్ ప్రొడక్షన్స్ నుండి విభిన్నమైన చిత్రాలు వస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం సురేష్ బాబు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని స్టార్ట్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలని ఖండించిన సురేష్ బాబు, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని స్టార్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదని, దానికి చాలా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని తెలిపాడు. అయితే తాజా సమాచారం ప్రకారం సురేష్ బాబు ఓటీటీ దిశగా అడుగులు వేస్తున్నాడని సమాచారం అందుతోంది. అయితే అందులో తెలుగు కంటెంట్ తో పాటు హిందీ వెబ్ సిరీస్ లు కూడా ఉంటాయట. బాలీవుడ్ లో రానాకి ఉన్న సంబంధాలతో ఈ వేదికలో బాలీవుడ్ జనాలకి కూడా ప్రాముఖ్యం ఇవ్వనున్నారట.
మరి ఈ ఓటీటీ ఎప్పుడు స్టార్ట్ అవనుంది తదితర విషయాలు మరికొద్ది రోజుల్లో వెల్లడవుతాయని అంటున్నారు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో ఓటీటీకి డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సురేష్ బాబు మొదలు పెట్టే ఓటీటీకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.