నాగ్ అశ్విన్ అనుకున్నది సాధించాడు. ప్రభాస్ కోసం బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనేని దించుతున్నాడు. మొన్నటివరకు దీపికా.. ప్రభాస్ హీరోయిన్ అన్నప్పటికీ.. నిన్న నాగ్ అశ్విన్ దాన్ని ఫైనల్ చేసి అందరికి షాకిచ్చాడు. పాన్ ఇండియా కాదు.. ప్రభాస్ తో తాను చెయ్యబోయే సినిమా పాన్ వరల్డ్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా కోసం కింగ్ కి సరిపోయే క్వీన్‌ని తెస్తున్నా అంటూ తన సినిమా ఎలా ఉండబోతుందో నాగ్ అశ్విన్ హింట్ ఇచ్చేశాడు. కింగ్, క్వీన్ అంటున్నాడంటే.. నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమాని రాజుల కాలం నాటి కథతో తెరకెక్కించబోతున్నట్టు అర్ధమవుతుంది. మరి పాన్ వరల్డ్ మూవీ కోసం దీపికాని తీసుకుంటే.. పద్మావత్ సినిమాతో బాలీవుడ్‌లో 600 కోట్లకి పైగా కలెక్ట్ చేసి తన సత్తా చూపించిన దీపికా ఈ సినిమా కోసం ఎంత తీసుకుంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.
అయితే నాగ్ అశ్విన్ - ప్రభాస్ మూవీ కోసం దీపికా పదుకొనే పదో పరకో కాదు... ఏకంగా 30 కోట్ల పారితోషకం అందుకోబోతుందట. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. సౌత్ కి ఈ సినిమాతోనే దీపికా పరిచయం. అయినా పాన్ వరల్డ్ మూవీ, బాలీవుడ్‌లో ఫుల్ ఫేమ్. అందుకే దీపికా అడిగింది కాదనకుండా వైజయంతీ వారు ఆ 30 కోట్లు ఇచ్చేస్తున్నారట. అయితే దీపికా పదుకొనేకి ఎంతిస్తే ఏంటి.. ఈ కాంబినేషన్ పట్ల ప్రభాస్ అభిమానులు తెగ ఆనందపడిపోతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి దీపికా హైట్‌కి, ప్రభాస్ హైట్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ కుదురుతుంది. అలాగే ప్రభాస్ స్టార్ డమ్‌కి, దీపికా స్టార్ డమ్ తోడైతే సినిమాపై అంచనాలు ఆకాశన్నంటడం ఖాయం.