Advertisementt

రీమేక్ కోసం దర్శకుడిని వెతికే పనిలో నాగార్జున..

Tue 21st Jul 2020 08:34 AM
nagarjuna,wild dog,raid,telugu  రీమేక్ కోసం దర్శకుడిని వెతికే పనిలో నాగార్జున..
Nagarjuna seraching for director రీమేక్ కోసం దర్శకుడిని వెతికే పనిలో నాగార్జున..
Advertisement
Ads by CJ

మన్మధుడు 2 సినిమా తర్వాత నాగార్జున వైల్డ్ డాగ్ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. సోలోమన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా కొన్ని రోజుల పాటు వాయిదా పడింది. మన్మధుడు 2 సినిమాకి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న నాగార్జున, ఇక రొమాంటిక్ కథల జోలికి వెళ్లకుండా వైల్డ్ డాగ్ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఈ చిత్రం అనంతరం టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంళో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించనున్నాడు.

దీనితో పాటు మరో సినిమాని కూడా లైన్లో పెట్టాడు. బాలీవుడ్ లో సక్సెస్ సాధించిన రైడ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడట. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపించింది. అయితే ఈ సినిమాపై ఉన్న ఇంట్రెస్టుతో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. అయితే ఈ రీమేక్ ని డైరెక్ట్ చేసే దర్శకుడి కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఒకరిద్దరు కొత్త దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇంకా ఫైనల్ అవలేదు. మరి రైడ్ సినిమా తెలుగు రీమేక్ ని తెరకెక్కించే దర్శకుడెవరో చూడాలి.

Nagarjuna seraching for director:

Nagarjuna seraching for director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ