Advertisementt

బండ్ల గణేష్‌లో ఇంకా ఆ కోరిక ఉంది!

Tue 21st Jul 2020 06:34 PM
pawan kalyan,bandla ganesh,gabbar singh,producer,one more chance  బండ్ల గణేష్‌లో ఇంకా ఆ కోరిక ఉంది!
Bandla Ganesh wants One more chance from Pawan బండ్ల గణేష్‌లో ఇంకా ఆ కోరిక ఉంది!
Advertisement
Ads by CJ


కరోనాతో 14 రోజులు హోమ్ క్వారంటైన్‌లో గడిపి మళ్లీ కరోనా నెగెటివ్‌తో సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ అయిన.. బండ్ల గణేష్ కరోనాతో తాను కుంగిపోకుండా కరోనాని ధైర్యంగా జయించానని చెబుతున్నాడు. కరోనా కారణంగా భయపడకుండా ఇంట్లోనే ఆవిరిపడుతూ.. వేడి నీళ్లు తాగుతూ పౌష్టిక ఆహారం తినడమే కాకుండా మెడిటేషన్ చేసి.. ఒకే గదిలో 14 రోజులు తనకు తానుగా బందీ అయ్యానని.. ఇలాంటి చిట్కాలు పాటించి కరోనాని ఈజీగా జయించవచ్చని చెబుతున్నాడు బండ్ల గణేష్. అయితే ఇటు సినిమాల విషయంలోనూ కాంట్రవర్సీలకు నెలవు అయిన బండ్ల గణేష్ మొన్నామధ్యన ‘సరిలేరు నీకెవ్వరు’లో ప్రాధాన్యత లేని పాత్ర వేసి పేరు పోగొట్టుకున్నానని, ఇక మీద అలాంటి పాత్రలే కాదు సినిమాల్లో నటించనని చెప్పి షాకిచ్చాడు.

అయితే ఎప్పుడూ మాట మీద నిలబడని బండ్ల గణేష్.. ఇప్పుడూ అంతేలే అని అందరూ సరిపెట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తనకి దేవుడి అని చెప్పుకునే బండ్ల గణేష్‌కి కరోనా వచ్చినప్పుడు తన దేవుడు కరోనాతో ఎలా ఉన్నావ్ అని కనీసం ఫోన్ లో కూడా పలకరించలేదని చెప్పాడు. అయితే ప్రస్తుతం నిర్మాతగా కాస్త గ్యాప్ తీసుకున్న బండ్ల గణేష్ తన దేవుడు మరోసారి అవకాశం ఇస్తే సినిమా నిర్మిస్తా అని చెబుతున్నాడు. దేవుడు అంటే పవన్ కళ్యాణ్. పవన్ గనక సినిమా అవకాశం ఇస్తే మరోసారి నిర్మాతగా యాక్టీవ్ అవుతా అంటుంటే.. అటు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేయాలో లేదో అనే కన్ఫ్యూజన్ లో ఉంటే.. బండ్లకి ఎలా అవకాశం ఇస్తాడు అని అంటున్నారు పవన్ ఫ్యాన్స్.

Bandla Ganesh wants One more chance from Pawan :

Bandla Ganesh interest on Movie with Pawan Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ