ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aditya Om Experimental Film Bandhi first look Out

ఆదిత్య ఓం ‘బందీ’ చిత్రంలో ఒకే ఒక్క పాత్ర!

తెలుగు సినిమా కొత్త ఒరవడిని సృష్టిస్తూ.. కమర్షియల్ బాట నుండి కొత్త ప్రయోగాల వైపు దృష్టి సారిస్తుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆ ప్రయోగాలను ఆదరించటం మంచి పరిణామం. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ మొదలుకొని ఎన్నో విజయవంతమైన తెలుగు చిత్రాల్లో నటించిన హీరో ఆదిత్య ఓం.. ఓ సరికొత్త ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బందీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మూవీ ఫస్ట్ లుక్‌ని కూడా రిలీజ్ చేసారు.

ఈ సందర్భంగా ఆదిత్య ఓం మాట్లాడుతూ.. ‘‘సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్రతో ఉంటుంది. ఇలాంటి ప్రయోగాత్మక సినిమా తెలుగులో రావటం ఫస్ట్ టైం, ఆ అవకాశం నాకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా వుంది. ఇంతకుముందు నన్ను ఎలా ఆదరించారో అలాగే నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మా ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రానికి దర్శకత్వం: రాఘవ.T, ఫొటోగ్రఫీ: మధుసూధన్ కోట, స్క్రీన్‌ప్లే: రాకేష్ గోవర్థన్ గిరి.

Aditya Om’s First Look From His Experimental One Character Film Bandhi Out

Aditya Om Experimental Film Bandhi first look Out
aditya om
first look
experimental film
one character
film bandhi